Tuesday, May 5, 2015

నిట్టూర్పులు



అర్ధరాత్రి వరకూ
అటు ఇటు దొర్లుతుంటాను.
నిద్రపట్టక
ఒక పదం, ఒక ముఖం
ఆలోచనలను వెంటాడుతూ
ఆమె ముఖచిత్రం
నా మనస్సు పొరలలో ఛాయ లా
కళ్ళముందు కదిలిన ప్రతిసారీ
నాకు మతి భ్రమణం కలిగి
చెప్పడానికి ఉన్నాయి. చాలా విషయాలు
కానీ,
నోరు మెదపడానికే భయం
ఎక్కడ తిరస్కారం ఎదురవుతుందో
అనే .... ఈ మౌనం. 


నేను ఒక సాధారణ పిరికివాడిని.
వెల్లికిలా పడుకుని
ఆమె గురించే ఆలోచిస్తూ.
ఆమె నెమ్మదితనం,
ఆ చూపుల్లో స్పష్టత,
ఆ లోతైన ఆలోచనలు,
ఆ మృదు స్వరం,
పదునైన ఆ తెలివి,
చురుకైన ఆ చేతులు
సున్నితత్వానికి ప్రతిరూపం ఆమె లా
ఆమెను అలా చూస్తున్న ప్రతిసారీ
ఆ బ్రహ్మ కళాత్మకతను
ప్రస్తుతించుతునే ఉంటాను.
శున్యంగా రాత్రి లోకి
చూస్తూ భారం గా నిట్టూరుస్తూ

No comments:

Post a Comment