ఒక దశలో ....
నేనూ, నాఉద్దేశ్యమూ తప్పేమో అనుకుని
తరచి చూసుకుంటే అర్ధం అయ్యింది..
అబద్దం చెప్పింది, మోసపుచ్చింది
రోడ్డు మిదకు లాగి నిర్దయగా నన్నొదిలింది
నీవైనా దోషినని ఎందుకు ఆలోచిస్తున్నానూ అని
కాలమే సమాధానం చెప్పింది .... అన్నింటికీ
ఎలాంటి నొప్పీ లేదిప్పుడు
బాధ వెళ్ళిపోయింది దూరంగా, బహు దూరంగా
నా నొప్పిని, నా తలభారాన్ని తీసుకుని
బాధలు, వడగాలులూ రోదనలను తీసుకుని
అందుకే దూరంగా వెళ్ళిపోయిన నీకు మనస్పూర్తిగా
సలాము చెబుతున్నాను..
ముందుకు కదులుతూ ఒక్క క్షణం ఆగి మరీ
సముచిత స్థానం, గౌరవము ప్రస్తావన చేసి ఉంటే
నీ జతలా, నీ పక్కన నీడలా
నీ జీవన భాగస్వామినై ఉండిపోయేదాన్ని కానీ
నేను ఇప్పుడు ఏడ్చి ఏడ్చి అలసిపోయున్నాను.
నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను
అలక్ష్యానికీ, నీకు దూరంగా ..... సెలవు అని చెప్పి
కలిసి కూర్చుని సమశ్యలను సర్ధుకుని
సమాధానించుకుని ఉంటే మరోలా ఉండేది
సామరశ్యం, సంప్రదింపులనె అవకాశాలకు దూరంగా
అభద్రత వైపు నెట్టేసావు నన్ను,
నీ అలక్ష్యం, నీ అమానుషత్వం, నీ శాడిజం కు.
దూరంగా ఉండాలనుకోవడానికి కారణానివి
నీవు కాదని నిరూపించడం ఇప్పుడు చాలా కష్టం.
పలుకరించాలని చూడొద్దని ఎన్నిసార్లో చెప్పాను ....
ఫోన్ చెయ్యొద్దని, మధ్యవర్తుల్ని ఇన్వాల్వ్ చెయ్యొద్దని
నీ రాక్షసకృత్యాలను గుండెల్లో దాచుకునే
సమయం మించిపోయింది
నీ మొండితనం, రెట్టమతం తో కలిసుండలేక
తప్పనిసరై ఈ నిర్ణయం తీసుకున్నాను.
నీ నిర్లక్ష్యం ఆటవికతనం సహించలేక
సమయం మించిపోతుందనిపించే
బాధ, తలభారము, మనోవేదనలకు సెలవు చెప్పి
దూరం జరిగి .... చివరి కన్నీటి బొట్టును జార్చుతూ
నూతన అధ్యాయం చిరునవ్వుతో ఆరంభించేందుకే
ఈ ముగింపు నిర్ణయం తీసుకుంది.
తూరుపు .... సూర్యుడి కిరణాస్వాదన స్పూర్తితో
ఆకాశం లో తేలి పరవశం తో
విచ్చుకుని వర్షించే ఆ మబ్బుల అనుభూతితో
నాకంటూ ..... ఒక ఉనికి, ఒక అస్తిత్వం
ఒక జీవనోద్దేశ్యం కలిగి, నిరూపించుకునే
ఒక వికాసం లక్షణం వైపు అడుగులెయ్యాలనుంది.
అందుకే .... ఈ నొప్పి, బాధ, తలభారాలకు దూరంగా
సెలవు అంటూ ముందుకు కదులుతుంది.
చైతన్యం దిశగా ఇప్పుడు, నాకు ప్రతి క్షణమూ ముఖ్యమే.
దేని కోసమూ ఎదురుచూడాలని లేదు.
రేపు నాకు ఇప్పుడు చాలా దూరం గా కనిపిస్తుంది.
విశ్లేషించుకున్న గతం అనుభవం పాటాల సాక్షిగా
స్వయంప్రకాశం లక్ష్యంగా, నిర్ణయం .... దూరంగా జరగాలని
No comments:
Post a Comment