నీకూ నాకు ఒకరిపై ఒకరికి ఉన్న మోహం
కుతూహలం కలిగించే
వివరింపబడని
ఒక అగమ్య రహదారి
అనంతం గా
వేడిగా, మురికిగా
రాజదాని నగర పొలిమేరల కందకాల కోరిక లా
కాలుతున్న రాత్తిరి వార్తలా
అప్రమత్తంగా ఉంచుతూ .... అందరినీ
ఒక తిరిగి వచ్చిన
ఖైదీని లా, నేను
నీ దోష, దుర్మార్గాలను ఛిద్రం చేసి
సొంతం చేసుకునే ద్రోహిని
ఒక దోపిడీదారుడ్నై
నీ రొమ్ము మీద .... ఎప్పటికీ
చెదరని నీ అంతరంగం కోరికనై
తలదిమ్ము ప్రేమ లోతునై
నీ గుండె చప్పుడు వేగాన్నై
No comments:
Post a Comment