ఏ అమ్మాయైనా ఒక అబ్బాయిని ఇష్టపడితే అతన్నే ఎంచుకుంటుంది
అతనితోనే కలిసి ఉండాలని కోరుకుంటుంది.
ఉదయాన్నే నిద్రలేచి అతన్ని మేల్కొలిపి గిల్లికజ్జాలాడటం ఒక వింత అనుభవం ఆనందం ఆమెకు.
అతనితో పోట్లాడుకోవడంలో ఆనందాన్ని పొందుతుంది.
అతని అబద్దాన్ని పట్టుకుని ఏమీ ఎరగనట్లు అమాయకం గా నటించడం లో ఒక అందమైన అనుభూతిని పొందుతుంటుంది.
అతనికి తెలిసేలా తనూ అబద్దాలాడుతుంది.
ఒకరి అసంతృప్తికి ఒకరు కారణం అవుతూ అంతలోనే సమాధానపడుతుండటం జరుగుతుంది.
తన నిర్ణయానికి అసంతృప్తి చెందక అతన్నే ఎంచుకుంటుంది మళ్లీ మళ్లీ.
అతనూ ఆమెనే ఎంచుకుంటాడు .... ఇది ఎంత అందమైన సామాజికానుభవం
No comments:
Post a Comment