Sunday, May 17, 2015

జీవన భాగస్వామి


ఎల్లప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీ నల్ల జుట్టు తెల్లబడినప్పుడు కూడా .... నిస్సత్తువలోనూ.
నున్నని నీ మృదు యౌవ్వన కోమలత్వం వయస్సు మీదపడి సున్నిత కోమలత్వంగా మారినప్పుడు కూడా నీ చర్మాన్ని స్పర్శించుతూనే ఉంటాను. 
సొట్టబుగ్గల స్థానంలో ముఖం ముడతల మయమై నీవు నవ్వని క్షణాల నీ నవ్వు పువ్వుల్ని నీ చమత్కారం మాటల మెరుపులను నీ కళ్ళలో చూసి ఆనందిస్తాను. బాధతో నీవు విలపించినప్పుడు జారని నీ ప్రతి కన్నీటి బొట్టు గుర్తునూ సున్నితంగా తుడిచి నేనున్నానని గుర్తు చేస్తాను
నీవు నా జీవితం భాగస్వామివి సుమా. ఒక నిధి లా నిన్ను బద్రం గా నా బాధ్యతగా చూసుకోవడం నా ధర్మం. నిజం ....
నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నా, నీ చివరి శ్వాస వరకూ

No comments:

Post a Comment