నా చెయ్యందుకో స్రవిస్తున్న కన్నీటి ధారలకు దూరంగా ఎక్కడికైనా నీతో పాటు తీసుకుని వెళ్ళు భయం ఇక్కడ ఎటుచూసినా
కన్నీళ్ళు ఆగడం లేదు. నీరసపడి, మసకేసిపోతున్నాను. ఎంతో కాంతివంతమైన గతం నిన్ను కోల్పోయి ఇప్పుడు కాంతి హీనమై ఈ హృదయం కుళ్ళబొడవబడి వెచ్చని కన్నీళ్ళు మండుతున్నాయి. వేడి కన్నీటితో జీవితం తడిచిపోతుంది.
జీవితం లో ఆశ దూరమై కలలు రాకుండా పోయాయి. నీవు వెళ్ళిపోతూనే అన్నీ నన్నూ వదిలి వెళ్ళిపోయాయి. నేనిప్పుడు వేచి చూస్తున్నాను. నీ కోసం ఎన్నటికీ రావని కనిపించవని తెలిసీ
నెమ్మదిగా మరణిస్తున్నాను. అణువు అణువుగా క్షీణిస్తున్నాను. వెలుతురు చీకటిగా పగలు రాత్రిగా తెలుపు నలుపుగా ఆనందం అశాంతిగా నవ్వు నిట్టూర్పుగా పరిణమిస్తూ
నా వద్ద ఇప్పుడు ఏమీ లేవు. నీవు కూడా లేవు నన్ను బ్రతికించి నాకు దూరంగా ఆ స్వర్గాన్ని ఒంటరిగా చేరిన అన్యాయివి నీవు
పెదవంచును ముద్దాడిన కన్నీటికి వీడ్కోలు తెలుపనా సరే అయితే స్వాతంత్రాన్ని ప్రసాదించు ఈ అచేతనావస్థనుంచి శూన్యం నుంచి బ్రతుకు బంగారు పంజరం నుంచి చీకటి కలుగులో నుంచి ఏమీలేనితనం నుంచి మళ్ళీ నన్ను పూరించు పొంగేవరకు అంచువరకూ నా మనోశిఖరాంతం వరకూ మరోసారి మళ్ళీ మళ్ళీ ప్రేమ తో పరిమళం తో
నీ, నా నిన్నటి జ్ఞాపకాల సాగరంలో పీకలవరకూ మునిగి వెలికి రాలేక ఎన్నాళ్ళిలా అని వాపోతున్నాను, ముక్కలైన నేను ఒక్కడినిగా అయ్యేందుకు శూన్యం నిండిన పాత్రను లా కాక అద్దంలో చూసుకున్నా నన్ను నేను గుర్తించేదెలా అని
సూర్యోదయం వేళ గడ్డి పూలు, ఆకులు రాలిన మంచుబిందువుల్లో ఉషా కిరణాల వెలుగులను దాచుకుని సంబరపడ్డట్లు నీవు లేని ప్రపంచంలో నీ అనుభూతులను నెమరువేసుకుంటూ .... ఎనాళ్ళిలా అని ఒకప్పటి దినచర్యల అనుభూతుల సుడిలో చిక్కుకుని
నాటి మన ప్రతి అనుభూతీ ఒక దృశ్యరాగం గా మారి మనోసంకెల లా నా నాడీ వ్యవస్తను అస్తవ్యస్తం చేసి ఆలోచనలన్నీ ఆ జ్ఞాపకాల చుట్టే పరిబ్రమిస్తూ నేను బలహీనుడ్ని అవుతూ పదే పదే గుర్తొస్తున్నాయి. ఇచ్చిపుచ్చుకున్న నాటి చిన్ని చిన్ని అవసరాల ఆనందాల అవశేషాలే అన్నీ అని వాటికి ఇంతగా ఆకర్షితుడ్నౌతానని ఏనాడూ అనుకోలేదు.
చేతిలో చెయ్యేసుకుని, చెట్టాపట్టాలేసుకుని వెన్నెల్లో తోటలో విహరించిన క్షణాలలో నిన్ను చూసి నొచ్చుకుని ముడుచుకుపోయిన ఆ పూల మనోగతాలు నాకు ఇంకా గుర్తున్నాయి. నీవు జతగా నడుస్తున్నప్పుడు నాలో కలిగే ఆ ఆనందం, ఆ విశ్మయం, ఆ గర్వం ఊపిరాడనివ్వక పోయినా ఏదో చిత్రమైన భావన నాకేమీ కాదని, ఏమన్నా అయినా సరే అని
ఇప్పుడు నాకు ఊపిరాడటం లేదు. శ్వాసించలేకపోతున్నాను. నాడు నీ తలను నా భుజం పై ఆనించి వెన్నెల వర్షం లో, మనం నర్తించిన ఆ చిత్రమైన అనుభూతులు సృష్టి కర్తను నేను లా .... ఆ వింత ఆనందం అలా జరిగిన ప్రతిసారీ నా హృదయం లో కొంత భాగం నీ సొంతం అయ్యి వేదన, బాధ, నొప్పి తో కూడిన అనిశ్చితి నాలో
ఆ మిగిలిన హృదయంతో కదిలేందుకు ప్రయత్నిస్తున్నాను.
చిరు మాటలు, చిరు నవ్వులు, చిరు ఆనందాలు నీతో కలిసి పంచుకున్న ప్రతి సారీ .... ప్రేమగా అణువణువులోనూ సుతారంగా నీవు పేర్చిన ఈ ఆలోచనలను దూరంగా నెట్టెయ్యలేను. నీ ప్రతి చూపుతోనూ నీ ప్రతి స్పర్శ తోనూ నీ ప్రతి మందహాసంతోనూ నన్నూ, నా అన్నింటినీ ఆనందం అనుభూతులన్నీ నీతో తీసుకెళ్ళావనలేను.
నేనిప్పుడు ఏమీ లేను. ఏమీ ఈ మిగుల్చుకోలేదు .... అందుకే, తలొంచుకుని పంచభూతాల్లో కలిసిపోయిన నీకు నివాళులర్పిస్తున్నాను. ఎప్పుడూ అందంగా, స్థిమితంగా, సామాన్యంగా ఉండి బలాన్నిచ్చిన జతను, నిన్ను కోల్పోయినందుకు .... అలాగే, నన్ను కోల్పోయిన నా కోసం కూడా నీ జ్ఞాపకాల సమాది ముందు మోకరిల్లి మౌనంగా రోదిస్తూ .... నివాళి అర్పిస్తున్నాను.
ఆలోచిస్తుంటేనే చాలా కష్టం గా ఉంటుంది నడుస్తున్న బాటలో సజావుగా నడవడం వాస్తవాలను జీర్ణించుకోవడం నిజాన్ని కళ్ళలో కళ్ళు పెట్టిచూడగలగడం నేనిప్పుడు అలాంటి అవస్థలోనే ఉన్నాను
నా హృదయాన్ని తెరిచి చూపిస్తాను నా మనోభావనల్ని నీ ముందు పరుస్తాను నీవు చూసేందుకు వీలుగా నా ప్రేమలో ఎలాంటి సందిగ్ధత లేదు నీ పట్ల నేను దాయగలిగిందీ లేదు
అందుకే విశాలమైన నీ కళ్ళను తెరిచి జన్మజన్మల బంధాన్ని నన్ను గుర్తించేందుకు ప్రయత్నించు నా కోసం నీవు ఏమి కావాలనుకుంటున్నావో .... మరిచి నన్ను నన్నుగా పరిశీలనగా చూడు
నేన్నిన్ను కొల్పోయే స్థితిలో లేను. సమస్యలెన్నున్నా ఏదో లా దాటగలను కానీ ఇప్పుడే కాదు ఎప్పుడూ నేన్నిన్ను కోల్పోలేను ఎంతో కష్టపడి జీవితం లో నిలబడ్డాను నీ కోరికే అయితే నీ చుట్టే తిరగమన్నా సరే కానీ
మనుష్యులం .... ఎన్నో పొరపాట్లు తప్పులు చేసి ఎదురుదెబ్బలు తింటూ ఉంటాము గమ్యాన్ని కొల్పోతూ ఉంటాము అయినా కాలం పెట్టే ప్రతి పరిక్షలోనూ నిలబడి నెగ్గి అదే జీవన సత్యం అని అనుకుంటుంటాము
పిల్లా! నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను. నన్ను ఉండమనడమో వెళ్ళిపో అనడమో అంతా నీ ఇష్టమే! .... ఎందుకో తెలుసా నాకుగా నేను నిన్ను వొదిలి వెళ్ళలేను. వెళ్ళను కూడా నా హృదయానికి తెలిసింది నీవు మాత్రమే కనుక
ఈ నిర్ణయం. అవ్యవస్థితురాలిని అవ్వొద్దనే ఇకపై ఒక దశలో .... నేనూ, నాఉద్దేశ్యమూ తప్పేమో అనుకుని తరచి చూసుకుంటే అర్ధం అయ్యింది.. అబద్దం చెప్పింది, మోసపుచ్చింది రోడ్డు మిదకు లాగి నిర్దయగా నన్నొదిలింది నీవైనా దోషినని ఎందుకు ఆలోచిస్తున్నానూ అని కాలమే సమాధానం చెప్పింది .... అన్నింటికీ
ఎలాంటి నొప్పీ లేదిప్పుడు బాధ వెళ్ళిపోయింది దూరంగా, బహు దూరంగా నా నొప్పిని, నా తలభారాన్ని తీసుకుని బాధలు, వడగాలులూ రోదనలను తీసుకుని అందుకే దూరంగా వెళ్ళిపోయిన నీకు మనస్పూర్తిగా సలాము చెబుతున్నాను.. ముందుకు కదులుతూ ఒక్క క్షణం ఆగి మరీ
నీవు నన్ను సరిగ్గా అర్ధం చేసుకుని ఉండి ఉంటే సముచిత స్థానం, గౌరవము ప్రస్తావన చేసి ఉంటే నీ జతలా, నీ పక్కన నీడలా నీ జీవన భాగస్వామినై ఉండిపోయేదాన్ని కానీ నేను ఇప్పుడు ఏడ్చి ఏడ్చి అలసిపోయున్నాను. నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను అలక్ష్యానికీ, నీకు దూరంగా ..... సెలవు అని చెప్పి
కలిసి కూర్చుని సమశ్యలను సర్ధుకుని సమాధానించుకుని ఉంటే మరోలా ఉండేది సామరశ్యం, సంప్రదింపులనె అవకాశాలకు దూరంగా అభద్రత వైపు నెట్టేసావు నన్ను, నీ అలక్ష్యం, నీ అమానుషత్వం, నీ శాడిజం కు. దూరంగా ఉండాలనుకోవడానికి కారణానివి నీవు కాదని నిరూపించడం ఇప్పుడు చాలా కష్టం.
ఇకనైనా ఆ ప్రస్తావనలు చెయ్యడం .... ఆపు పలుకరించాలని చూడొద్దని ఎన్నిసార్లో చెప్పాను .... ఫోన్ చెయ్యొద్దని, మధ్యవర్తుల్ని ఇన్వాల్వ్ చెయ్యొద్దని నీ రాక్షసకృత్యాలను గుండెల్లో దాచుకునే సమయం మించిపోయింది నీ మొండితనం, రెట్టమతం తో కలిసుండలేక తప్పనిసరై ఈ నిర్ణయం తీసుకున్నాను.
నీ నిర్లక్ష్యం ఆటవికతనం సహించలేక సమయం మించిపోతుందనిపించే బాధ, తలభారము, మనోవేదనలకు సెలవు చెప్పి దూరం జరిగి .... చివరి కన్నీటి బొట్టును జార్చుతూ నూతన అధ్యాయం చిరునవ్వుతో ఆరంభించేందుకే ఈ ముగింపు నిర్ణయం తీసుకుంది.
తూరుపు .... సూర్యుడి కిరణాస్వాదన స్పూర్తితో ఆకాశం లో తేలి పరవశం తో విచ్చుకుని వర్షించే ఆ మబ్బుల అనుభూతితో నాకంటూ ..... ఒక ఉనికి, ఒక అస్తిత్వం ఒక జీవనోద్దేశ్యం కలిగి, నిరూపించుకునే ఒక వికాసం లక్షణం వైపు అడుగులెయ్యాలనుంది.
అందుకే .... ఈ నొప్పి, బాధ, తలభారాలకు దూరంగా సెలవు అంటూ ముందుకు కదులుతుంది. చైతన్యం దిశగా ఇప్పుడు, నాకు ప్రతి క్షణమూ ముఖ్యమే. దేని కోసమూ ఎదురుచూడాలని లేదు. రేపు నాకు ఇప్పుడు చాలా దూరం గా కనిపిస్తుంది. విశ్లేషించుకున్న గతం అనుభవం పాటాల సాక్షిగా స్వయంప్రకాశం లక్ష్యంగా, నిర్ణయం .... దూరంగా జరగాలని
తన తోడును, తనకు నీడను దూరం చేసిన దేవుడిని ఉదహరించే ఆ కేకలు, ఆ అరుపులు, ఆ రోదనలు గుండెలు ద్రవించే ఆ శాపనార్ధాలు పరిసరాలను వ్యాపించి ఆ కేకల్లో ఆమె కోపం నన్నెందుకు ముందుగా తీసుకెళ్ళాడని నేను చేసిన ఏ పాపానికో ఏ రక్త విధ్వంసానికో ప్రతిక్రియ గానో అయినా
ఆ అనర్ధం రోదనలు లీలగా ఏ అశరీరవాణి పలుకుల్లానో ప్రతిధ్వనిస్తూ ఆమె ఆరోపణలను వినలేక ముడుచుకుని నా ఆత్మ పరిసరాల్లో పరిబ్రమిస్తుంది. చుట్టూ కురుస్తున్న, వర్షం శబ్దం ను మించిన శబ్దం తో తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది ఆమె గోడలు కట్టిన అబద్దాలు నిజాలుగా ఎన్నో ఓదార్పు గొంతులు దైవ ధిక్కారాల్లా వినిపిస్తూ
ఆ ఆరోపణలు, ఆ కేకలు ఆమె గొంతులో కసి రుజువులుగా .... ఆ శాప వాఖ్యాలు అన్ని వైపులకు విస్తరించి, వర్షంలా .... అందరిని తడిపి ఒక్కసారిగా వినిపించడం ఆగిపోయింది. ఆశ్చర్యపోయాను. నిజానికి, అప్పుడే నా శరీరాన్ని పాడె లోనికి జరిపారు. సహజీవన ప్రమాణం చేసి వదిలెళ్ళుతున్న నన్నో నన్ను దూరంగా తీసుకెళుతున్న దేవుడ్నో ఇప్పుడు ఆమె ఆక్రోశము నాకు వినిపించడం లేదు.
ఆర్ధికంగా సామాజికంగా భర్త పైనే ఆధారపడ్డ ఒక సగటు ఇల్లాలు ఆమె .... పాపం అనిపించింది. ఎందుకో గానీ
నా హృదయ అంతరంగం అంతా శూన్యం గా ఆ శూన్యమే కదులుతూ, తిరుగుతూ రక్తం స్రవించేలా ఒత్తిడి చేస్తూ, గుచ్చుతూ .... అయోమయం, అంధకారం జిజ్ఞాస కానీ అక్కడ అంతా ఖాళీ గా ఉంది. అభ్యంతర మందిరం పరిసరాలు దీపం వెలుగు కోసం నీ ఆగమనం కోసం ఎదురుచూస్తూ నా కోరిక నీవు, నా అవసరం నీవు, నా ఆవేశం నీవు. నా పరిసరాలు, నా నీడ, నా లోపల నా శూన్యం, నా భయం పారద్రోలి జీవనార్ధాన్ని పెంచే ప్రియరాగం నీవు. నరాలు, కండరాలు, పక్కటెముకలతో కట్టబడిన ఈ కోమల హృదయ మందిరంలో చిత్రమైన శబ్దాలు, మూలుగులు సవ్వడులు దయ్యాలు, ఆత్మల కదలికల్ని తరిమికొట్టాల్సిన దీపం వెలుగు .... మనొజ్ఞివి నీవు అని నా పక్కటెముకలు నిన్ను అర్ధిస్తూ ఉన్నాయి. అర్ధపారదర్శకంగా తెరుచుకుని .... నీ ఆగమనంకోసమే అని
ఎంతో విశాలమైన నా హృదయ మందిర ప్రాంగణంలో రక్త తివాచీ మీద నీవు నడుస్తూ వస్తూ ఉంటే అందమైన ఆశ్వాసన ఏదో భుజం తట్టుతున్నట్లు ఉంది. నీ రాకతో ఇప్పుడు, నాలో లోలోపల విస్తృత వైభవ ప్రకాశం పండుగ వాతావరనం మరో నిజం తెలిసింది. నీవు అపరిచితురాలివి కావు అని ఒక సంతులనశక్తివి అని ఊపిరులతో చీకటి లోనూ గుర్తించబడే పరిమళానివని నా మనోగగన వెన్నెల ప్రకాశానివి అని నీ నామ సౌందర్యారాధనే ఇక్కడ అన్ని వేళలా అని
చెత్తలోకి జారిన పారవేసుకున్న ఆశలు నిన్నటి కలలు తియ్యని జ్ఞాపకాలు డైరీలో అక్షరాలు పదాల పొదరిళ్ళు వెక్కిరిస్తున్నట్లై . ప్రతి సందేశం తోనూ ఒక అనుభూతి తలపు ఏడిపిస్తుంటే డైరీలోంచి చింపి తొలగించాను.
కేవలం మూర్చిల్లిన శబ్దం లా పేలవమైన నవ్వొకటి హృదయం లోంచి పరామర్శలా రాలీ రాలని కన్నీరు రుచి పెదవుల్ని తాకింది. ఓదార్పు మాటల సన్నిహితులు కొన్ని స్మృతుల్ని అతికించి మరీ వెళ్ళిపోయారు. నాటి నా ఆత్మరాగ పదాల మాధుర్యాలు నన్ను విఛ్చిన్నం చేసేలా చేసి
ఉనికంటూ లేనట్లు అన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే చుట్టూ ముసురుకుని నన్ను .... జరిగిన ఉపద్రవం ఆలోచనకు తావివ్వలేక నిశ్శబ్దంలో కలిసిపోయిన నొప్పిని విస్మరిస్తున్న క్షణాల్లో రాలిన నిర్లిప్తత భావమే కొన్ని పదాలుగా రూపుదిద్దుకుని, సిరా స్మశానంలో నాలో నేను సంభాషిస్తూ ద్రవిస్తున్నాను.
అప్పుడప్పుడూ నిన్ను చూస్తూనే, అనిపిస్తుంది ఏ తారనో చూస్తున్నాను అని ఎన్ని జన్మల క్రితపు వాస్తవానుబంధమో అని కొన్నిసార్లేమో ఆ భావనే అన్నింటికన్నా నిజమూ స్వచ్చమూ అని
ఎల్లప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీ నల్ల జుట్టు తెల్లబడినప్పుడు కూడా .... నిస్సత్తువలోనూ. నున్నని నీ మృదు యౌవ్వన కోమలత్వం వయస్సు మీదపడి సున్నిత కోమలత్వంగా మారినప్పుడు కూడా నీ చర్మాన్ని స్పర్శించుతూనే ఉంటాను. సొట్టబుగ్గల స్థానంలో ముఖం ముడతల మయమై నీవు నవ్వని క్షణాల నీ నవ్వు పువ్వుల్ని నీ చమత్కారం మాటల మెరుపులను నీ కళ్ళలో చూసి ఆనందిస్తాను. బాధతో నీవు విలపించినప్పుడు జారని నీ ప్రతి కన్నీటి బొట్టు గుర్తునూ సున్నితంగా తుడిచి నేనున్నానని గుర్తు చేస్తాను నీవు నా జీవితం భాగస్వామివి సుమా. ఒక నిధి లా నిన్ను బద్రం గా నా బాధ్యతగా చూసుకోవడం నా ధర్మం. నిజం .... నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నా, నీ చివరి శ్వాస వరకూ
ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమ లో పడిపోవడం చూసి, అందుబాటులో ఎవరూ లేకో తప్పనిసరై అనుకునో కేవలం అప్రమేయంగా కలిసిపోయారనుకోవడమో తొందరపాటే అవుతుంది. ఏ అమ్మాయైనా ఒక అబ్బాయిని ఇష్టపడితే అతన్నే ఎంచుకుంటుంది అతనితోనే కలిసి ఉండాలని కోరుకుంటుంది. ఉదయాన్నే నిద్రలేచి అతన్ని మేల్కొలిపి గిల్లికజ్జాలాడటం ఒక వింత అనుభవం ఆనందం ఆమెకు. అతనితో పోట్లాడుకోవడంలో ఆనందాన్ని పొందుతుంది. అతని అబద్దాన్ని పట్టుకుని ఏమీ ఎరగనట్లు అమాయకం గా నటించడం లో ఒక అందమైన అనుభూతిని పొందుతుంటుంది. అతనికి తెలిసేలా తనూ అబద్దాలాడుతుంది. ఒకరి అసంతృప్తికి ఒకరు కారణం అవుతూ అంతలోనే సమాధానపడుతుండటం జరుగుతుంది. తన నిర్ణయానికి అసంతృప్తి చెందక అతన్నే ఎంచుకుంటుంది మళ్లీ మళ్లీ. అతనూ ఆమెనే ఎంచుకుంటాడు .... ఇది ఎంత అందమైన సామాజికానుభవం
చల్లటి చల్లదనం నవనాడుల్నీ స్తంభించిపోతూ యాంత్రికంగా పడే అడుగుల .... కవాతు, జడత్వం రక్త ప్రసరణ వేగం పెరిగి, నరాల అరుపులు జవాబు లేని సహాయం కోసం ఏడ్పులు శరీరం లో కణాలు చచ్చి కుళ్ళిన దుర్వాసన ప్రతి క్షణమూ చావును సమీపిస్తున్నట్లు ముదురు మబ్బులు అన్ని వైపుల్నుంచీ ఆకాశాన్ని కమ్ముకుని ఒక్కో చిన్న మేఘం ఒక్కో మనిషినీ అనుసరిస్తూ కమ్ముకుంటూ మీదపడిపోతున్న వృద్ధాప్యం అయి ఇక్కడికి ఏ సూర్యుడూ రాడు. వెచ్చదనం నమ్మకం ధైర్యం ను పంచేందుకు ఇక్కడ మిగిలేది చివరకు అస్తికలూ బూడిదే యాంత్రికమో ఉద్దేశ్యమో .... నడుస్తాము, శ్రమపడతాము అయినా స్తబ్ధమై ఎదుర్కొనీ సాధించలేని సమయాల్లో లొంగిపోతుంటాము .... పరిస్థితులకూ, కాలానికీ ఇది నిజం మాత్రమే కాదు, సాధించలేని అవాస్తవం కూడా ఇది ప్రతి రోజూ తంతు మెలుకువలోనూ నిద్దురలోనూ తప్పించుకోలేని స్థితి. భయం నీడలు ముసురుకుని, భయం తో నిద్దుర రాదు జ్ఞాన .... ఇంద్రియాలు దిగంబరమై, తెలిసింది కూడా మరిచిపోయి చావైనా వస్తే బాగుణ్ణు అని మనమే మనసారా కోరుకునేలా అంతరంగం లో నాదికాని ఏదో శక్తి ఉందనిపిస్తుంది. అది ఎప్పుడూ అరుస్తునే ఉంటుంది న్యాయం, న్యాయం ఎక్కడా అని ఆ నీడలు మబ్బుల ప్రభావమే మన సమాధుల్ని మనం కరుడుగట్టిన నేలల్లో యంత్రాల్లా తవ్వుకునే లా చేస్తూ ఆ నీడల ఆనందపు చిరునవ్వులే .... వెన్నులో చలి పుట్టిస్తూ అది స్పష్టంగా అరిష్టమే, దుష్కర్మ....ద్వారా ఆనందాన్ని పొందడమే ఎందుకో తెలియదు ఇప్పుడు నాకు ఈ అపజయాన్ని ఒప్పుకోవాలనిపించడం లేదు శతృవుతో పోరాడాలని, పోరాడాలి ప్రతి క్షణమూ అని ప్రభావం కనిపించేవరకూ అని ఏ మేఘాలూ, నీడలూ నా బలహీనతల్తో ఆడుకోని విధంగా మరణం నిజంగా ముందున్నా జీవితాన్నే కోరుకునేలా అది ఎంత కష్టమైనా .... అన్ని భయాలనూ ఎదుర్కుని ఈ పోరాటం లో నేను ఓడిపోను. అందరికీ కనువిప్పవుతాను, గెలిచి పురోగమిస్తాను. ప్రకృతి సహాయం తో అని అనుకునేలా ప్రకృతి మహిమే అనుకుంటాను. ఆశ లేని క్షణాల్లో ఊపిరిచ్చినందుకు ఏ దారీ కనిపించని వేళ నాకో దారి చూపించినందుకు ఇంద్రధనస్సు నా ఆలోచనల్లో మెరిసినందుకు ఆశ్చర్యం .... జీవితం ఒక పోరాటం, పోరాడాలి అని అనుకున్నానో లేదో .... ఇప్పుడు శతృవు పారిపోతున్నాడు. మబ్బులు కకావికలమై చెల్లాచెదురౌతున్నాయి చూస్తున్నాను, నా శతృవు నాలోనే ఉన్నాడనే నిజాన్ని స్పష్టం గా
అర్ధరాత్రి వరకూ అటు ఇటు దొర్లుతుంటాను. నిద్రపట్టక ఒక పదం, ఒక ముఖం ఆలోచనలను వెంటాడుతూ ఆమె ముఖచిత్రం నా మనస్సు పొరలలో ఛాయ లా కళ్ళముందు కదిలిన ప్రతిసారీ నాకు మతి భ్రమణం కలిగి చెప్పడానికి ఉన్నాయి. చాలా విషయాలు కానీ, నోరు మెదపడానికే భయం ఎక్కడ తిరస్కారం ఎదురవుతుందో అనే .... ఈ మౌనం.
నేను ఒక సాధారణ పిరికివాడిని. వెల్లికిలా పడుకుని ఆమె గురించే ఆలోచిస్తూ. ఆమె నెమ్మదితనం, ఆ చూపుల్లో స్పష్టత, ఆ లోతైన ఆలోచనలు, ఆ మృదు స్వరం, పదునైన ఆ తెలివి, చురుకైన ఆ చేతులు సున్నితత్వానికి ప్రతిరూపం ఆమె లా ఆమెను అలా చూస్తున్న ప్రతిసారీ ఆ బ్రహ్మ కళాత్మకతను ప్రస్తుతించుతునే ఉంటాను. శున్యంగా రాత్రి లోకి చూస్తూ భారం గా నిట్టూరుస్తూ
అదే నువ్వు, అదే కల మళ్లీ మళ్లీ అదే దృశ్యం .... సందర్శించుతూ, అది వాస్తవం కాదని అనుకోలేను? వాస్తవం అనీ అనుకోలేను.
కొన్ని తీగలు, గొలుసుల సంకెళ్ళు నీ గొంతు చుట్టూ బిగుసుకుని భయం, భీతి నీ కళ్ళలో అలౌకిక శక్తి సహాయం కోసం .... నీవు గొంతెత్తి పిలుస్తూ ఆ గొలుసులు, తీగలు నీ చుట్టూ మరింత బలం గా గాలిని కూడా చొరనీయనంతగా పెనవేసుకుని నీ గొంతు మూగబోతుండటము
నిద్రలోంచి లేచినట్లు ఆ దుర్బలస్థితి లోంచి నీవు ఒక్కసారిగా ఆ తీగలు ఆ సంకెళ్ళను తెంచుకుని బయటపడి అంతలోనే మళ్ళీ, అదే స్థితికి బంధీవి అయ్యేందుకు ఎదురుచూస్తుండటము ఎలా అర్ధం చేసుకోను.?
నిశ్చలంగా కురుస్తున్న వర్షపు సడి వింటూ నిన్న మధ్య రాత్రి వరకూ నిద్రాదేవి రాక కోసం .... ఒక ప్రియురాలి గుసగుసల కోసం వేచిచూసే ఒక సహనశీలి ప్రేమికుడ్ని లా
దారగా పైపుల్లోంచి జారు వర్షపు శబ్దం పెనుగాలి తోడై వర్షపు చినుకులు కిటికీ అద్దాలను వేగంగా తాకినట్లు పక్కటెముకలపై గుండె కొట్టుకుంన్న శబ్దం వేగం తగ్గి నెమ్మది చేకూరాలని
ఎండిన భూమి వర్షం కోసం ఎదురుచూసినట్లు తుఫానులా నీ రాక కోసం నేను నీతొ కలిసి నీవు తెచ్చే మురిపాలు పంచుకునే ఆనందానుభూతుల కోసం కళ్ళు తెరుచుకుని
గొంతు లో మింగుడుపడని ముద్ద లా ప్రారంభమై అగ్నిలా గుండెలో మిగిలిపోయావు నువ్వింకా నడుస్తూనే ఉన్నావు నా ఆలోచనల పొలిమేరల్లో ఈ బిస్లరీ సోడా ఎలా అయితే నా వేళ్ళ అంచుల్లో ఉందో అలా
ఎందరో అన్నారు. "ఏదో ఒకరోజు నీకు జ్ఞానోదయం అవుతుందిరా" అని నాకు బాగా గుర్తు నీవు నవ్వావు, కోపం తెచ్చుకోలేదు కొన్ని రోజుల కాలం గడిచాకే తెలిసింది ఆత్మీయతకన్నా ఆస్తి అస్తిత్వమే ముఖ్యమని నీకు ఎవరికోసమూ ఎవరూ పుట్టరని అన్నావు
అప్పటివరకూ ఎప్పుడూ కనుబొమ్మల్లోనే ఉన్న నీవు అప్పుడు, నిద్ర లేచాక కూడా నీ ముఖాన్ని గుర్తుంచుకోవద్దనుకునే స్తాయికి ఎదిగావు. కొన్ని రోజులు మాత్రం ఎంతో బాధ పడ్డాను. నీవు చేసిన పుండు సలిపి నీవు నా తలలోనే కూర్చుని చేసిన అలజడి అధికమై
నేనొక సగటు మనిషినని, సామాన్యుడ్నని బలహీనుడ్నని కూడా త్యాగాలు చేసేంత గొప్పవాడ్ని కాను. నాకు నిన్ను మరిచిపోవాలని లేదు. మరిచిపోలేను కూడా నా కోరికల్లా నీవూ గాయపడి బాధపడాలనే నేను గాయపడి బాధపడ్డట్లే నీకూ జరగాలనే
ఊరటనిపించి ఒక్కసారిగా గుక్కతిప్పుకోకుండా చేతిలో ఉన్న బిస్లరీ సోడా అంతా తాగాను. గొంతు తీవ్రంగా మండింది. తట్టుకోలేనంతగా నీవు గుర్తుకొచ్చిన క్షణాల మనోవేదన లా అది నా గొంతులో మింగలేని ముద్దలా గుండెలో చల్లారని అగ్నిలా అలా మండుతూనే ఉంది.
అడ్డంకులెన్నున్నా అధిగమించేందుకు ప్రేరణగా ఆ ఒక్క చిరునవ్వివ్వు చాలు, నీ చూపులు నా ఆత్మ రంద్రాల్లోకి దూరి అక్కడి అన్ని గుణాలనూ చిత్రాలుగా దాచేసుకునేట్లు చూడు చాలు
నా అభిరుచి, ఉత్సాహము, తపన .... ఒక విప్పని పేదరాసి పెద్దమ్మ కథే నీ పట్ల ప్రేమ తో అప్పుడప్పుడూ నిన్నొక దేవత అనుకుంటూ వెంటనే వాస్తవంలోకి జారివస్తూ, ఏ గుడి గంటల శబ్దాలో విని
తెల్లని పిండారబోసినట్లుండే ఆ వెన్నెల మార్గనిర్దేశం చేస్తుందనుకుని సిగ్గు అభిమానాలను దాచుకునే వేళ ఎప్పుడైనా కన్నీళ్ళు రాలాల్సొచ్చినా నీ నవ్వు వెలుగులే ఆసరా అనుకుంటాను .... మన ప్రేమ మార్గం లో మనకు
నన్ను పరిక్షించేందుకు వచ్చిన దేవతవేమో నీవు అని, అప్సరసవై నీవు, రెక్కలు విస్తరించుతూ, ప్రేమ ఆవిర్భవమని అనిపిస్తుంది. గాలి, నీరు, ఆకాశం అంతటా వ్యాపించి నన్నూ చేరిందని
ధరిత్రిలో నన్ను నేను కోల్పోయిన అనుభూతి నీవు లేని నేను అని ఒక ఒంటరి ఆత్మ ధరించిన ఒక శరీరాన్ని మాత్రమే నేననే భావన పెరుగుతూ
నా పెదవుల పై నీవు అద్దాల్సిన ముద్దు సంతకం ప్రామాణికతగా నా జీవితం లో నీ ఉనికి ఒక సరికొత్త చరిత్రయ్యి .... మోహావేశపు చిత్రాలు నా మది గోడలపై వ్రేలాడాలని అనిపిస్తుంది.
నేనెల్లప్పుడూ నిన్నే ప్రేమించి ఆరాధించేలా అనుమతిని పొందాలని నిన్నే చూస్తూ నడిచేప్పుడు, ఆ నక్షత్రాల కాంతిని తలదన్నే నీ నవ్వుల్ని కళ్ళ బుట్టలోకి ఏరుకునే .... ఒక సదవకాశాన్ని పొందాలని