Saturday, February 15, 2014

భ్రమ




 











చిక్కుకున్నది మాత్రం సాలెగూడులో
తేనెతుట్టెలమయ ....
రాజోద్యానవనం లో
అర్ధనిమీలిత నేత్రాల .... నిద్దుర లేచిన
ఒక అడివి పుష్పము పూచిన ....
నవ్వునులా
మమతానురాగాల తేనె జిగురు లో
ఇరుక్కుపోయి .... నేను

ఏదో బాధ,
మరేదో నొప్పి
అసహాయతతో కూడిన ఆవేశం
నిలువెల్లా దహించి వేస్తూ ....
నేను
కనిపిస్తున్నాను .... చూడు
నీ కళ్ళలో ప్రతిబింబిస్తూ
ఒక స్ఫటికాకారంలో

చూడు! ఆ సాగరం లో
ఆ ఎగసిన అల ను
అది పడి లేచే విరామం లో
ఉక్కిరిబిక్కిరి అయిపోయి
సహాయం కోసం,
జీవించడం కోసం ....
తీరానికి ఈదుకెళ్ళుతున్న
అస్పష్ట ఆకారాన్ని .... నన్ను!



 


















కాలచక్రం ఇప్పుడు
నా చీలమండలను
బలంగా పట్టుకుని
నన్ను సముద్రంలోకి లాగుతుంది.
భయం, చీకటి, నిద్ర లకి సంబంధం లేని
అంతులేని ఆకలి లో
పూర్తిగా మునిగి తేలుతున్న .... నన్ను
వర్తమానం కుచేలుడ్ని

4 comments:

  1. కాలచక్రం ఇప్పుడు
    నా చీలమండలను
    బలంగా పట్టుకుని
    నన్ను సముద్రంలోకి లాగుతుంది.
    మునగక తప్పదు ఇలా లాక్కెలితే

    ReplyDelete
    Replies
    1. కాలచక్రం ఇప్పుడు
      నా చీలమండలను
      బలంగా పట్టుకుని
      నన్ను సముద్రంలోకి లాగుతుంది.

      మునగక తప్పదు ఇలా లాక్కుని వెళ్ళితే

      అవును సుమా! బాగుంది అభినందన స్పందన
      ధన్యాభివాదాలు పద్మార్పిత గారు!

      Delete
  2. భ్రమ చాలా బాధాకరంగా ఉంది చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. భ్రమ చాలా బాధాకరంగా ఉంది చంద్రగారు.
      భ్రమ మాత్రమే అయినంతవరకూ భావ్యమే
      చక్కని స్నేహాభినందన స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవీ!

      Delete