Thursday, December 5, 2013

నా జ్ఞానజ్యోతివి నీవు


బాల్కనీ లో కూర్చుని, 
అల్లంత దూరాన చీకటిని తూట్లు పొడుస్తూ, 
పాలరాళ్ళపై తెల్లగా, విధ్యుద్ధీప కాంతిని పరుస్తూ,
మెరుస్తున్న బిర్లా టెంపుల్
మరో వైపున తటాకం లో
ఒంటరిగా తాపసిస్తున్న బుద్దుడ్ని చూస్తూ,
ఎన్ని రాత్రులో .... నేను అలా నిశ్చేష్టుడ్నిలా ....

నా అంతరంగం లో మాత్రం
నావి ఎవరి కోసమో ఎదురుచూపులు
నా కోసమే పాట పాడే ఒక మంచి మనసు కోసం.
అందుకే .... రాబోయే ఆ అజ్ఞాత మనసు కోసం
నేను కన్న ఎన్నో కలల్ని, ఎన్నో ఆశల్ని,
అంతరంగం లో, చీకటి అయోమయం పొరల్లో
భద్రం గా దాచుకునున్నాను.

సరిగ్గా అప్పుడే
నా తపస్సు ఫలించినట్లై నీవొచ్చావు.
నా జీవితాన్ని వెలుగు మయం చేసేందుకు.
నమ్మకాన్ని పెంచి, ముందుకు మనోరధం వైపు
నడిపించేందుకు
నీవు వెలిగించాల్సిన ఆ జ్ఞానజ్యోతి కాంతిని నేనే.

ఇప్పుడు ....
చైతన్యం వైపు కదులుతూ,
అలసిపోయినక్షణాల్లో నీ వొడిలో కాసింత సేదదీరి
నీవు పాడే ఆ మధుర భావనల పాటలు వింటూ,
జీవ సాగరం అలలపై తేలుతూ
ఆ ఆకాశాన్ని, నక్షత్రాల్నీ చూస్తూ
ఆశావహం గా వొడ్డువైపుకు కదిలి పోవాలని ఉంది.

ఔనూ!
నేను నా లక్ష్యం వైపే నేను నిజంగా కదలగలనా?
నాది కలా! నిజంగా అదృష్టమేనా?
నీకో గులాబీని బహూకరించి,
"నీవంటే ఇష్టం! అని, నిన్నే ప్రేమిస్తున్నా!" అనే
సావకాశం, ఆ క్షణానికి చేరువలో ఉన్నానా నేను?
ఎన్నో ప్రశ్నలు? కానీ, కొన్నే సమాధానాలు.

అందుకే, నా మనసుకిప్పుడు ఒంటరిగా మిగలాలని లేదు.
నీ నుంచి పొందే ఆ వెలుగు, ఆ నమ్మకం, ఆ చైతన్యం
ఆ జానపధ గీతం యొక్క మధుర గానం లో
అంతర్లీనం గా ఉన్న అమాయకత్వం
అనురాగ భావన లోని నిజాన్ని
నీ సాహచర్యం తోడుగా పదిలపర్చుకునే దిశగా కదలాలని,

2 comments:

  1. తనగూర్చి తాను ఆలోచించటం మొదటిసారిగా చేశాడు,
    తనలో ఓ లక్ష్యం వైపుగా నడిచే శక్తి ఉందని తెలుసుకున్నాటు,
    తనలో అగ్నాతంగా ఉన్న అంతరంగ్ పొరల్లోని మనసెవ్వరిదో తెలుసుకున్నాడు,
    ఆమె ప్రతి చర్యనీ తనకే సొంతం అనుకున్నాడు,
    ఆకరికి ఆ పిల్ల, తన స్నేహశీలే అని తెలుసుకున్నాడు,
    (సర్, ఇదీ నేను మీ అమ్రుతధారలో దోసిట పట్టుకున్న నాలుగు బిందువులు.)

    ReplyDelete
    Replies
    1. "తనగూర్చి తాను ఆలోచిస్తూ, ఓ లక్ష్యం వైపుగా నడిచే శక్తి ఉందని తెలుసుకున్న .... అతను, తనలో అజ్ఞాతంగా అంతరంగం పొరల్లో దాగి ఉన్న చీకటిని పారద్రోలేందుకు ప్రేరణివ్వగల మానసిక సౌందర్యాన్నీ, ప్రకాశాన్నీ ఒక మహిళ లో చూసి, ఆమె ప్రతి చర్య తనకే సొంతం అనుకోవడం తో పాటు, ఆ పిల్లే, తన స్నేహ శీలి అని తన సాహచర్యం తోడు గా పొందాలనుకుంటాడు.
      (సర్, ఇదీ నేను మీ అమృతధారలో దోసిట పట్టుకున్న నాలుగు బిందువులు.)"

      రవి కానని ది కవయిత్రి కానగలదు అని మరోసారి నిరూపించారు. కొంతవరకు మీ అబిప్రాయం వాస్తవమే. నిరాస నిస్పృహల్లో ఉన్న మనిషి ప్రోత్సాహక హస్తం కోసం తపిస్తుంటాడు. మీ విశ్లేషణకు అభివాదాలు.
      నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete