Tuesday, December 3, 2013

అమరం మన ప్రేమ









 







కాలం కక్ష కట్టి .... మనల్ని దూరం చేసినా,
నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.
మాటిస్తున్నాను.
ఆ నక్షత్రాలు రాలుతున్నా,
నా దృష్టి అంతా నీ మీదే .... అని.
నిన్నే తలుస్తూ,
నీవు కానిదేదీ నా కక్కర్లేదని చెబుతూ,
నేను నిజంకానిదేదీ చెప్పను.
మళ్ళీ చెబుతున్నాను .... ఓ చెలీ,
నీ ప్రేమ కోసం దేన్నైనా చేస్తాను.
ఆ నక్షత్రాలను తెచ్చిమ్మన్నా,
ఆ చంద్రుడ్ని కొనితెమ్మన్నా ప్రయత్నిస్తాను.
నిద్దుర పోని, నిద్దుర లేని రాత్రులలో
జాగరణల్లో ఆ మహత్తు ఉందనుకుంటున్నాను.
ఈ భూమిపై .... ప్రళయం సంభవించినా,
నేను నిన్నే పలుకరిస్తూఉంటాను.
నీ కలలు మసకేసిపోయినప్పుడు
నీకొసమే ఎదురుచూస్తూ, ప్రేమిస్తూ ఉంటాను.
వేసవికాలపు చల్లదనానివి.
చలికాలపు వెచ్చదనానివి.
శరత్కాలపు స్పర్శ వు.
వసంతకాలపు ఆత్మ వు, నా ప్రకృతివి .... నీవు.
నా ఆకాశానివి, కురిసే వర్షానివి,
నా ప్రేమ సమృద్దిగా పుష్పించి
పరిమళించే ఈ భూమివి .... నీవు.
నా గుండె నవ్వువు, నా ఆత్మ శ్వాసవు.
మన ఆశలు, కలలు ఒక్కలానే
ఎప్పటికీ మన హృదయాల్లో ....
నీకేమనిపిస్తుందో చెప్పు!
నేనంటే ప్రేమ అని, ప్రేమ భావనే అని,
చెప్పు నిజమని,
నా హృదయం చెబుతుంది. నిజమని, నిజమే అని.
కాలం మనల్ని దూరం చేసినా
నేనెప్పుడూ నీ ఎదురుగా .... నీ కోసమే,
నీవు నా గుండెలో, ప్రతి రాత్రీ నా కలల్లో ....
ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు గడిచినా
నిన్ను మరిచిపోనని ఒట్టేసి చెబుతున్నా! 
కళ్ళూ కళ్ళూ కలిసిన క్షణం నుంచి,
నవ్వు పరామర్శల ....
ముద్దు ముచ్చట్లింకా అలాగే గుర్తున్నాయి.
ఆకాశం పడొచ్చు .... ఆ చుక్కలు, సూర్యుడు,
చంద్రుడు తలక్రిందులవ్వొచ్చు!
నేను మాత్రం నిన్నే ప్రేమిస్తాను. ప్రేమిస్తూ ఉంటాను.

2 comments:

  1. అమరమైన ప్రేమ కావ్యం అద్భుతం.
    పిల్ల... చెలిగా మారటం గమ్నార్హం:-))

    ReplyDelete
    Replies
    1. అమరమైన ప్రేమ కావ్యం అద్భుతం. పిల్ల .... చెలిగా మారటం గమనార్హం:-))
      ఒంటరిగా లక్ష్యాన్ని చేరగలననుకున్నప్పుడు .... పిల్ల
      ఆమె సహకారం కూడా కావాలి లక్ష్యాన్ని చేరడానికి అనిపించినప్పుడు .... చెలి
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు .... మీ సూక్ష్మ పరిశీలనకు!

      Delete