Wednesday, December 25, 2013

ఎందుకో తెలియదు!



 















వెనక చూపులే అన్నీ 
గతాన్ని ఆలోచిస్తూ,
కాలం తో పాటు కదులుతూ.
నా మదిలో
కొత్త జ్ఞాపకాలు కొన్ని
పాత జ్ఞాపకాలపై మరుపు దుప్పటై
ఎప్పటికప్పుడు
చాయల్లా .... మసకేసి పోతూ
కొన్ని రంగులద్దుకుంటూ, వస్తూ పోతూ,
కళ్ళముందు .... నర్తిస్తూ

జ్ఞాపకాల మైలురాళ్ళు
కొన్ని ....
ఎంతో గర్వం గా ఫీల్ అయ్యిన సంఘటనలు
కొన్ని
సిగ్గు పడిన న్యూనతావేళలు .... ఎన్నో
మతిమరుపు పరదా చాటున దాచేసుకుని
కనపడకుండా జాగ్రత్త పడినా ....
చివరికి అవి కూడా
నా మది పొరల్లో నిక్షిప్తాలే
ఎద గోడపై పుట్టుమచ్చలే

ఉద్వేగాలు కొన్ని, ఉపేక్షలు కొన్ని
ఆసక్తి, అనుభూతి, ఆవేశం
ద్రావకాలతో నిండి .... జీవితం ఇది.
అవి ఎప్పుడైనా పొంగి, పొర్లి
అంతరాంతరాల్లో, ఎద స్పందనలై ....
కళ్ళలోంచి కన్నీరై కారుతూ ....
పొంగి
చిందిన ఆ పరిసరాలు
పులకరింతలో, జలదరింపులో అవుతూ

నిజం నేస్తం!
గొప్ప అనుభూతి .... జీవితం
ముగింపు తెలియని అనిశ్చితే అయినా
భ్రమ లోనే జీవిస్తున్నా!
చావే లేదన్నట్లు ....
ఎందుకో తెలియదు?
రేపు ఉంటానో లేదో తెలియకుండానే రేపు కోసం,
మార్చలేని మార్పు కోసం ....
నన్ను నేను మోసం చేసుకుంటూ,
ఎన్నో అవకాశాల్ని కోల్పోయాను.
నిన్నటి అనుభవాల సహాయంతో
వర్తమానాన్ని అందంగా మార్చుకోకుండా

2 comments:

  1. భూత కాలంలోని విషయాలను వర్తమానకాలంలో ఆలోచిస్తూ భవిష్యత్ కాలం గూర్చి మరచి జీవితాన్ని చేజార్చుకోవడం నిజంగా దురదృష్టం చంద్రగారు బాగుంది భావం .

    ReplyDelete
    Replies
    1. "భూత కాలంలోని విషయాలను వర్తమానకాలంలో ఆలోచిస్తూ భవిష్యత్ కాలం గూర్చి మరచి జీవితాన్ని చేజార్చుకోవడం నిజంగా దురదృష్టం చంద్రగారు. బాగుంది భావం ...."
      బాగుంది స్పందన. స్నేహాభినందన
      ధన్యవాదాలు శ్రీదేవీ.

      Delete