Thursday, December 26, 2013

అన్యాయం సుమా!



 













కిటికీ అద్దం లోంచి ....
తొంగి చూసి,
దూరి, విస్తరించి, ఉషా కిరణాలు
సూదుల్లాంటి శరాలు
దొంగల్లా
ఏమీ లేదు "కాజువల్ గా వచ్చాను" అన్నట్లు
జారుకున్నాయి.
నా బద్దకాన్ని దొంగిలించి ....
నా మది గదిని కిలకిలారావాలు,
చేతనత్వం తో నింపి మరీ.

8 comments:

  1. nice...

    ఉదయ...
    హృదయ...
    చేతన...

    ReplyDelete
    Replies
    1. నైస్ ....

      ఉదయ ....
      హృదయ ....
      చేతన ....

      ముందుగా, నా బ్లాగు కు స్వాగతం ఎన్ ఎం రావు బండి గారు!

      బాగుంది మీ స్పందన చక్కని చేతనాభినందన
      ధన్యవాదాలు ఎన్ ఎం రావు బండి గారు! సుప్రభాతం!!

      Delete
  2. చిత్రం అద్భుతంగా ఉంది, అంతేనండీ సూర్య కిరణాలెప్పుడూ నిద్రలేపేస్తాయి.
    చంద్ర కిరణాలైతే నిద్రపుచ్చుతాయి.
    మంచి భావుకత సర్.

    ReplyDelete
    Replies
    1. చిత్రం అద్భుతం .... సూర్య కిరణాలెప్పుడూ నిద్రలేపుతూ .... చంద్ర కిరణాలేమో నిద్రపుచ్చుతూ .... మంచి భావన
      బాగుందని చక్కని స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

      Delete
    2. పుచ్చుతూ...ఏంటి పుచ్చుతాయి, సో చెద్రుడి కన్నా సోముడే గొప్ప.

      Delete
    3. నిద్ర లేపుతూ, నిద్ర పుచ్చుతూ ఆ సూర్యచంద్రులు .... అనడాన్ని అభ్యంతరిస్తూ, చంద్రుడి కన్నా సోముడే గొప్ప అని స్పందన.
      డిక్షనరీలు వెదుక్కున్నాను ధర్మ సూక్ష్మం ఏమయ్యుంటుందబ్బా అని,
      పురాణనామచంద్రిక లో ఇలా వివరించబడింది సోముఁడు గురించి.
      ఇది శివునికి ఒక నామాంతరము అని, ఇతఁడు అత్రిఋషికి అనసూయకు బ్రహ్మంశమున పుట్టాడని, పాలసముద్రమున పుట్టాడని, ప్రజాపతి కొడుకు అని కూడా వివరించబడింది.
      నా|| చంద్రుఁడు.
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు. బద్దకాన్ని వొదిలించినందుకు.
      శుభోదయం!!

      Delete
  3. "ఉష , కిరణ్ " వచ్చి స్వయంగా లేవమంటే లేవనిదెవరు ? చంద్రగారు చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. "ఉష, కిరణ్" వచ్చి స్వయంగా లేవమంటే లేవనిదెవరు? చంద్ర గారు చెప్పండి.
      నిజమే! ప్రేమ చురక కలిసి నిద్రా భంగం చేసినంత ....
      కాఫీ కాలి పెదాలు చురుక్కుమని, బద్దకం వొదిలిపోతుంది. లేచికూర్చోవాలి. తప్పదు.
      ధన్యవాదాలు శ్రీదేవీ. బద్దకం వొదిలించినందుకు. శుభారుణోదయం!!

      Delete