Tuesday, December 24, 2013

కాలగతి













ఇది నా సామ్రాజ్యం .... ఇక్కడ అంతా నేనే 
నాదే అంతా ఇక్కడ 
నేను మాత్రమే నివశిస్తుంటాను. 
నా అంగీకారంతోనే ఎవరైనా ఇక్కడ ఉండేది. 
నేను ఉండమన్నప్పుడు ఉండి 
వద్దంటే వెళ్ళిపోవాలి ఎవ్వరైనా

ఎవరైనా 
నాతో మాట్లాడగలిగేది 
నా సమ్మతం తోనే 
నేను ఎక్కడ అంటే అక్కడే 
నేను కోరుకున్న వాహనంలో 
నేను నిర్ణయించిన స్థలం లో
నా ఇష్ట ప్రకారమే

ఇంతవరకూ జీవితం లో 
నేను కావాలనుకున్న ప్రతిదీ పొందాను. 
ఎలాంటి అసౌకర్యమూ కలగ లేదు. 
సమశ్యల కొండలు ఎన్నైనా 
ఒక్కటొక్కటిగా ద్వంసమై దూళిగా 
గాలిలో కలిసిపోయేవి.
నాకు ఊపిరి పీల్చుకునే స్వేచ్చ దొరికేందుకు

ఉదయం నేను లేచినప్పుడే 
ప్రకృతికీ స్వాంతనం 
నేను కోరుకున్నప్పుడు, 
నేనెరుగని కాలంలోకి 
స్వాగతించబడుతూ ....
భవిష్యత్తు సుపరిచితం లా 
నా పలుకరింపుకోసం అలమటిస్తూ ఉంటుంది.

రేపు ఎప్పుడూ అందంగా ఉంటుంది .... ఊహల్లో. 
ఆ ఊహలు నా మనోగతం మేరకే ....
నేను కోరుకున్న భవితవ్యమే నాది 
నాకు ఈ సమీకరణాలంటే ఇష్టం. 
నేను కాలాన్ని ప్రేమిస్తున్నాను. 
వర్తమానం లో జీవిస్తున్నాను 
అది నాతోనే నేనే లానే అందంగనే ఉంటుందని.

2 comments:

  1. నిజమే కాలాన్ని ప్రేమించేవారు దేనికీ రాజీ పడరు.
    కానీ కాలం కూడా వారితో రాజీ పడదు గమ్మత్తుగా..:-))

    ReplyDelete
    Replies
    1. "నిజమే కాలాన్ని ప్రేమించేవారు దేనికీ రాజీ పడరు.
      అలానే కాలం కూడా వారితో రాజీ పడదు .... గమ్మత్తు కదూ..:-))"
      అంటూ ఎంత చక్కని అపురూప భావనో .... ఈ మనసు స్పందన చాలా బాగుంది మెరాజ్ గారు
      ధన్యవాదాలు.

      Delete