Monday, December 9, 2013

మనిషిని చదవలేకే ....


కన్నీళ్ళపర్యంతం
భయ విహ్వల అయ్యింది ఆమె.
భయం, అనుమానం .... అయోమయం
తనలో చోటు చేసుకున్న పరిణామాల్ని
విన్నవించుకుంది అతనికి.
........
సంతోషపడతాడు, ఉల్లాసంతో ఊగిపోతాడు.
"నేనున్నాను" అని, గర్వపడటం తో పాటు
ధైర్యం చెబుతాడు అనుకుంది.
"తొందరపడ్డావు? ఆలోచన లేదు!
మూర్ఘురాలివి?" ఊహించని మందలింపు,
అనాసక్తత ను తట్టుకోలేక పోయింది.

అతను .... దొరబాబు. వదలి, వెళ్ళిపోయాడు.
తిరిగి వస్తాడని, ప్రేమ పాశం లాక్కొస్తుందని
చూడకుండా ఉండలేని భ్రమలో
చాన్నాళ్ళు గడిపింది.
నిష్క్రమిస్తాడని, నిశబ్దం గా జారుకుంటాడని
ఊహించని, మనసుకు నచ్చచెప్పుకోలేని స్థితి లో

చరిత్ర పునరావృతం.
మరోసారి మోసపోయింది ఆడతనం.
ఆమె గుండె బ్రద్దలయ్యింది.
పగిలిన ముక్కల్ని యేరుకోవాల్సిన స్థితి.
తప్పంతా తనదే .... చేరువవ్వడం.
అప్సరసవన్నాడని. ప్రాణానివన్నాడని.
దేవతవన్నాడని.
బ్రతకలేనన్నాడని .... నమ్మడం.
............
బాధ్యతారాహిత్యం గా అతను, 
పట్టించుకోకుండా పారిపోతాడని అనుకోకపోవడం.
సమాధానం చెప్పుకోవాల్సిన,
దుస్థితితో పాటు,
నేరస్తురాలవుతానని అనుకోక పోవడం.
...........
ఇప్పుడనిపిస్తుందామెకు.
మనిషిని చదవగలిగే మనసుంటే
ఎంత బాగుండేదీ అని. 
హృదయం విశ్చిన్నం కాకుండా
కాపాడుకోగలిగేదాన్ని కదా అని.

4 comments:

  1. ఇతను అందరిలాంటి వాడు కాదు , మాది అందరి ప్రేమ వంటిదికాదు , మా బంధం అందరిలాంటిది కాదు ..... వంటి ఆలోచనలు ..... మోసగించాలనుకున్నవాడే ... తెగ పొగిడి నమ్మించే ప్రయత్నం చేస్తాడని తెలిసికోక పోవడం ...... నమ్మిన వారినే మోసం చేస్తారని తెలియక పోవడం .... నేరస్తురాలిలా తల దించుకోవడం .... నిజంగా బాధ పడాల్సిన విషయం . ఈ విషయాలు ఇటువంటి వారికి ఇలాగైనా తెలియాలని ఆశిస్తున్నాను . చంద్రగారు కవిత చాలా భారంగా ఉంది .

    ReplyDelete
    Replies
    1. "అందరిలాంటి వాడు కాదు, అందరి ప్రేమ వంటిదికాదు మా బంధం .... వంటి ఆలోచనలు .... మోసగించాలనుకున్నవాడే .... తెగ పొగిడి నమ్మించే ప్రయత్నం చేస్తాడని తెలుసుకోక పోవడం .... నమ్మిన వారినే మోసం చేస్తారని తెలియక పోవడం .... నేరస్తురాలిలా తల దించుకోవడం .... బాధ పడాల్సిన విషయం. ఇటువంటి వారికి ఇలాగైనా తెలియాలని ఆశిస్తున్నాను."
      చంద్రగారు కవిత చాలా భారంగా ఉంది.
      చిక్కని సూచన ప్రోత్సాహక అభినందన స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవి! శుభోదయం!!


      Delete
  2. మనిషిని చదవగలిగే మనసుండదు, (మనస్సు చదవదు,) నమ్ముతుంది,
    దేవి గారు చెప్పినట్లు తెగ పొగిడి, బుజ్జగించి మోసగించే ప్రబుద్దులున్నంత కాలమూ ప్రేమ మోసపోతూనే ఉంటుంది, జాగ్రత్త పడొద్దా అని సమాజం ప్రశ్నిస్తుంది, జాగ్రత్త పడితే అది వ్యాపారం అవుతుంది గానీ ప్రేమ కానేరదు.
    మీరు రాసిన ఈ కవిత వెనుక ఓ హెచ్చరిక ఉంది, మెస్సేజ్ ఉంది. సున్నితమూ ఉంది, కవిసమయం బాగా కుదిరింది.

    ReplyDelete
    Replies
    1. మనిషిని చదవగలిగే మనసుండదు, ( మనస్సు చదవదు. ) నమ్ముతుంది. దేవి గారు చెప్పినట్లు తెగ పొగిడి, బుజ్జగించి మోసగించే ప్రబుద్దులున్నంత కాలమూ ప్రేమ మోసపోతూనే ఉంటుంది. జాగ్రత్త పడొద్దా అని సమాజం ప్రశ్నిస్తుంది. జాగ్రత్త పడితే అది వ్యాపారం అవుతుంది గానీ ప్రేమ కాదు. మీరు రాసిన ఈ కవిత వెనుక ఓ హెచ్చరిక ను చూస్తున్నాను. మెస్సేజ్ ఉంది. సున్నితత్వం ఉంది. కవి టైమింగ్ బాగుంది.
      చక్కని విశ్లేషణ, కాంప్లిమెంట్స్ తో కూడిన స్పందన .... స్నేహాభినందన
      నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!

      Delete