Monday, December 30, 2013

కవిత్వం రాయాలని .... కవిత్వం



 













నాకు కవిత్వం రాయాలని ఉంది.
ధైర్యమే లేదు.
రాసేందుకు కావలసిన శిక్షణే లేదు అని.
భయం .... న్యాయం చెయ్యలేనేమో అని,

ఏదో రాయాలనిపించి, రాసి
చదివి చూసుకున్నాను.
ఎందరో రాస్తున్న కవితల్నీ చదివాను.
వారు రాసిందే బాగుంది అనిపించింది.

ఆ కావ్యదేవత నన్ను కటాక్షించ లేదేమో,
దూరం గా జరిగిపోయిందేమో .... అని!
అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది.
ఔనూ! కావ్యదేవతేనా? కవి దేవుడైతే కాదు కదా? అని,



 










అందమైన శ్రేష్ట పదాలు తట్టడం లేదు.
రాయాలనే ఉబలాటం పెరుగుతుందే కానీ,
ఊహలు పరిమళాలై నన్ను ముసరడం లేదు.
ఆవేశం బడబాగ్నిలా .... నాలో రగలడమూ లేదు.

కానీ, నాకు మాత్రం కవిత్వం రాయాలని ఉంది.
సాటి మనిషిని, నన్నులా ప్రేమిస్తూ .... ప్రేమ గురించి,
మంచితనం, అనురాగం, మానవత్వం గురించి,
సంఘటన, సందర్భాల్ని ఇతరులు చూడని కోణం లో చూస్తూ,
సామజిక భద్రత గురించి, ఆస్వాదించ గల కవిత్వం రాయాలనుంది.



 











కేవలం ప్రయోజనకర సాహిత్యం రాయాలనుంది.

6 comments:

  1. Replies
    1. నా బ్లాగుకు స్వాగతం రోహిణి కుమార్. డి!
      నైస్ వన్! ....
      చక్కని స్పందన అభినందన
      ధన్యవాదాలు రోహిణి కుమార్! శుభమధ్యాహ్నం!!

      Delete
  2. రాయాలి అనే తపన కలగడమే ,రాయడానికి పునాది.సామాజిక హితకరమైనవీ/ప్రయోజనకరమైనవీ రాయాలనుకోవడం పరిపక్వతకు నిదర్శనం/చంద్రగారు మీ కవిత అభినందనీయం.

    ReplyDelete
    Replies
    1. "రాయాలి అనే తపన కలగడమే, రాయడానికి పునాది. సామాజిక హితకరమైనవీ/ప్రయోజనకరమైనవీ రాయాలనుకోవడం పరిపక్వతకు నిదర్శనం/చంద్రగారు మీ కవిత అభినందనీయం."
      ఒక చక్కని సూచనాత్మక అభినందన స్పందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ! శుభసాయంత్రం!!

      Delete
  3. అందమైన ఆలొచనలను, ఇంకా కొంచం పదును పెడితే,
    ఆవేశమైన వాఖ్యాలు వస్తాయి, వాటికి మీ వద్ద ఉన్న తెలివి, వివేకమూ చాలు.

    తయారీకి కావలసిన వస్తువులు.:
    1.కంప్యూటరూ, కొంత సమయమూ,
    2.ఆలోచించాల్సిన అంశమూ,
    3.దానికి కావాల్సిన సమాచారమూ, వగైరా..:-))
    సర్, మీ ఆలోచనా పరిపక్వత కంటే ఇంకేమి కావాలి.

    ReplyDelete
    Replies
    1. "అందమైన ఆలొచనలను, ఇంకా కొంచం పదును పెడితే, ఆవేశమైన వాఖ్యాలు వస్తాయి, వాటికి మీ వద్ద ఉన్న తెలివి, వివేకమూ చాలు.

      తయారీకి కావలసిన వస్తువులు.:
      1.కంప్యూటరూ, కొంత సమయమూ,
      2.ఆలోచించాల్సిన అంశమూ,
      3.దానికి కావాల్సిన సమాచారమూ, వగైరా..:-))

      సర్, మీ ఆలోచనా పరిపక్వత కంటే ఇంకేమి కావాలి."

      ఒక చక్కని వంటకం లా స్పష్ట వివరణాత్మక కథనం స్పందన .... అభినందన
      __/\__లు మెరాజ్ ఫాతిమా గారు! శుభసాయంత్రం!!

      Delete