Friday, December 27, 2013

ఎందుకు?











ఎందుకు? 
ప్రేమ యింత కఠినం!? 
ఎందుకు??
ఎందుకు యింత కఠినము!!?? 
నేను అనుకుంటాను ఆమె నన్ను ఇష్టపడుతుందని. 
కానీ, 
ఆమె నన్ను ఇష్టపడదు. 
ఎంతో లోతుగా, గాడంగా ....
నిశ్చయించుకుని ఉంటాను. నా ఆశల గమ్యం ఆమె అని.  
కానీ, 
నా తల తిరిగేలా చేస్తుంది.
కుదురుగా ఉండనీయకుండా .... ఆమె.  
నా హృదయం, అచేతనము అగమ్యము అవుతుంది. 
ఎందుకు? 
ఎందుకని?? 
ప్రియురాలి మనసు యింత కఠినం!?

4 comments:

  1. ఎంత స్వార్దం కదా, తనకు నచ్చే విదంగా లేకపోతే కఠినమే...

    ReplyDelete
    Replies
    1. ఎంత స్వార్దం కదా, తనకు నచ్చే విదంగా లేకపోతే ....
      కఠినమే ....
      ఔనూ అబ్బాయికి నచ్చేవిధంగా అమ్మాయుండాలని అబ్బాయి పడే బాధ, భావనలోని స్వల్ప బుద్దిని వ్యంగ్యంగా చెప్పడాన్ని స్వాగతించిన మెరాజ్ గారికి ధన్యవాదాలు! శుభసాయంత్రం!

      Delete
  2. ప్రియురాలి మనసు కఠినమా......?మరి ఇదే అబ్బాయిని ఇష్టపడే మరో అమ్మాయి పరిస్థితీ........అప్పుడు ఈ అబ్బాయి మనసు ఆ అమ్మాయికి..... ఎలా కనిపిస్తుంది.....ఎలా కనిపించినా పర్వాలేదా ? ఎందుకంటే ఈ అబ్బాయిగారికి ఆ అమ్మాయంటే ఇష్టంలేదు కదా ........ఇదే తన ప్రియురాలికీ వర్తిస్తుందని తెలుసుకునే ఙ్నానం ఉన్నవాడే నిజమైన ప్రేమికుడు చంద్రగారు .

    ReplyDelete
    Replies
    1. "ప్రియురాలి మనసు కఠినమా......?
      మరి ఇదే అబ్బాయిని ఇష్టపడే మరో అమ్మాయి పరిస్థితీ........?
      అప్పుడు ఈ అబ్బాయి మనసు ఆ అమ్మాయికి..... ఎలా కనిపిస్తుంది.....? ఎలా కనిపించినా పర్వాలేదా ?
      ఎందుకంటే ఈ అబ్బాయిగారికి ఆ అమ్మాయంటే ఇష్టంలేదు కదా .... ?
      ఇదే తన ప్రియురాలికీ వర్తిస్తుందని తెలుసుకునే ఙ్నానం ఉన్నవాడే నిజమైన ప్రేమికుడు చంద్రగారు."

      ఎందుకు? ఎందుకని? మనిషి తనకోణమ్నుంచి మాత్రమే చూసి ఒక నిర్ణయానికొస్తాడు?
      అనే ప్రశ్ననే అన్యాపదేశం గా నేను కవితలో చెప్పింది.

      మీ స్పందనలో అదే విషయాన్ని మరికాస్త స్పష్టంగా విడమ్ర్చారు.
      చక్కని సూటి విమర్శనాత్మక శరం స్నేహపరామర్శ మీ స్పందన.

      ధన్యాభివాదాలు శ్రీదేవి! శుభోదయం!!

      Delete