Wednesday, December 25, 2013

తాపసి



 










ఆ బ్రహ్మ రాసిన అక్షరం లో
అమ్మ అయువును పోసి నేనయ్యాను.
ఆమె రాసుకున్న ఆశల భావనల రూపం నేను.
జ్ఞానాన్ని దిద్దుకుని చదువుకో అంది.
ఆమె ముద్దుగా మురిపెంగా నేర్పిన మాటలు 
విని అప్పచెప్పేవాడిని.
వచ్చీ రాని మాటల పసితనం అది.
..............
ముద్దులు, చందమామ కథలు ....
చాక్లెట్ వయసు దాటాక,
జీవితం ఊహలు కలల మయమైనప్పుడు ....
అవి ఎలా సఫలీకృతం చేసుకోవాలో చెప్పి,
ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు వైధ్యుడి గా మారి,
భయపడ్డప్పుడు ధైర్యం చెప్పి ....
తడబడి పడిపోతున్నప్పుడు పడకుండా ....
భుజాలే ఆసరాగా చేతులందించిన అమృత హస్తం అమ్మ.
................ 


 













తప్పుడుదారిలో నడిచెళ్ళుతున్నప్పుడు
నన్ను మందలించి
సరైన మార్గాన్ని సూచించి
భయంకర సునామీలనుండి నన్ను రక్షించి
జీవితం భారం అనిపించినప్పుడు
ఆత్మీయానురాగ కవచంతో
పొదుగుకుని వెచ్చదనాన్నిచ్చిన భూమాత అమ్మ.
................
ఎవో వింత అనుభూతుల కోసం, కోరికల సాధనకై
నేను దూరంగా వొదిలెళ్ళిపోయినప్పుడు కూడా,
ఎదురుచూసి .... నీడనిచ్చి ....
నీడగానే మిగిలేందుకు ఇష్టబడి
నా అభ్యున్నతినే తపించి
స్వర్గం లో నన్నుంచి .... నరకాన్ని తను అనుభవించి
ఆక్షేపించని అమ్మ .... ఏ శాపగ్రస్తో( ఏజన్మ లో )

4 comments:

  1. అద్భుతంగా ఉంది, అమ్మ పాదాలని తాకుతున్న భావన.
    అమ్మ ప్రేమ ఇలా ఉంటుందా అని అక్షరాల వెంట పరుగు పెట్టాలనే తపన ,
    నిజంగా అమ్మ తాపసి, ప్రేమకు ప్రత్యక్ష రూపసి.
    మీ అక్షరాలలో అమ్మని వెతుక్క్కున్నాను సర్.

    ReplyDelete
    Replies
    1. "అద్భుతంగా ఉంది, అమ్మ పాదాలని తాకుతున్న భావన. అమ్మ ప్రేమ ఇలా ఉంటుందా అని అక్షరాల వెంట పరుగు పెట్టాలనే తపన ,
      నిజంగా అమ్మ తాపసి, ప్రేమకు ప్రత్యక్ష రూపసి. మీ అక్షరాలలో అమ్మని వెతుక్కున్నాను సర్."
      మీ అభినందనకు నాకన్నా మీలాంటి కన్నతల్లులే అర్హులు. మీలోని అమ్మ మనసుకు మనోభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete
  2. అమ్మ ఒక మధుర భావన . ఆ బొమ్మ చూడగానే ఒక్కసారిగా " మదర్ ఇండియా " సినిమా గుర్తుకు వచ్చింది . అంత బాగుంది చంద్రగారు కవిత.

    ReplyDelete
    Replies
    1. అమ్మ ఒక మధుర భావన. ఆ బొమ్మ చూడగానే ఒక్కసారిగా "మదర్ ఇండియా" సినిమా గుర్తుకు వచ్చింది. అంత బాగుంది చంద్రగారు కవిత.
      అంతగానూ బాగుంది స్పందన. నీ అస్తిత్వంలోని అమ్మకు, అమ్మతనానికీ హృదయపూర్వక అభివాదాలు శ్రీదేవీ.

      Delete