Monday, March 16, 2015

జ్ఞాపకాల మరకలు



ఆనందం మసకేసిపోయి
నేనో వెర్రివాడిని అయిపోయి
ఏ చిన్న నొప్పినీ తట్టుకోలేని
శరీరం మండిపోయిన ఆ అనుభూతి క్షణాలు
ఎప్పుడు ..... ఈ బాధ, ఈ జీవితం నుంచి
విముక్తిని పొందుతానో అనిపించిన ఆ రోజుల్ని
మరిచిపోవాలని ప్రయత్నించీ మరిచిపోలేను.
నిరాశ, నిస్పృహల అగాధాల్లోకి
ఎక్కడికో జారి పడిపోతూ
ఉక్కిరిబిక్కిరై ఊపిరాడని ఆ క్షణాలు మరిచిపోలేను.  


గాలి కోపగించుకుని
దూరంగా కదలి వెళ్ళిపోయిన ఆ అనుభూతిని
లోపల హృదయం విచ్చిన్నమైపోయి
మొహమాటపు ఆచ్చాదనం పెచ్చులు
ముఖంపైనుంచి ఊడిపోయి
బలవంతపు నవ్వేదో
ముఖం పై నీడలా నర్తించిన ఆ క్షణాలు
మరిచిపోలేను .... ఎంత ప్రయత్నించినా,


No comments:

Post a Comment