Monday, March 9, 2015

గాలి కదలికల్లేక



పదాల గోడలు ప్రశ్నార్ధకాలై
ఎదురై
కారు మబ్బులు ఆకాశం పై
కమ్మేసుకొస్తూ
సూర్యకాంతి కనుమరుగై 
అంధకారం గాయం సులుపుతూ
తియ్యని నొప్పి, గుండెను ముట్టడించి  
భారమైన పదాలు, దట్టమై 
అక్షర సమూహాల ఆవేశానికి
నిస్తేజమైన మది
ధమనులు, సిరలు స్తంబించి
ఆత్మాభిమానం, ఆనందం
తడి పీల్చేయబడినట్లై
దుఃఖకర పదాల గద్గదస్వరం,
ఊపిరాడని గుండె, ఆత్మ
కలలు కల్లలై .....
ఆనందం
అహంకారం ముక్కలైపోయి

No comments:

Post a Comment