నేను నీ పక్కనే .... కష్టాల్లో, సుఖాల్లో
అంతం, స్వార్ధం లేని, స్నేహం లా
బలహీనురాలివయ్యినప్పుడు
నీవు ముందుకు కదలడానికి బలాన్నై
పిలిస్తే, నీ పక్కన ఉంటాను.
భయపడకు!
నమ్ము! మాటిస్తున్నాను
నీకు తగిలిన గాయాన్ని చూడగలుగుతున్నాను..
నీ నొప్పిని అనుభూతి చెందగలుగుతున్నాను.
బాధలు, కష్టాల వర్షం లో తడుస్తున్నప్పుడు
చుట్టూ అంతా చీకటిలానే కనిపిస్తుంది.
నీవు చూడగలవు, వెలుగుల్ని, కాంతిని, ఆశను,
ఎప్పుడైనా అనిపిస్తుంటుంది. తోడుండాలని,
అప్పుడు ఎవరూ తోడుండరు.
ఎవరూ తోడు లేరని, రారని, ఒంటరులమని
నీరసపు ఆలోచనలువస్తే, ఆ ఆలోచనల్లోంచి బయటికి రా!
ఎక్కడో .... విశ్వాసం, ప్రేమపట్ల
మనోభావనలకు ప్రాణంపోస్తూ ఒక నిర్వికార రూపం
అక్కడే వెతకాలి. ప్రేమ స్వరూపాన్ని, సూర్య కాంతి వెలుతురును.
మన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు
అక్కడ దొరుకుతాయి.
జీవించాలి, అనే భావన ఎంత బలమైనదో,
అంతే కటినమైనదని కాలం గడుస్తూ బోధపడుతుంది.
అయినా, పురోగమించాలి. తప్పదు.
అన్ని అడ్డంకుల్నీ అధిగమించి పోరాడాలి.
ప్రేమను, జీవితాన్నీ పొంది నమ్మకాన్ని పెంచి పోషించుకునే
ఆలోచనలతో అడుగు ముందుకు వెయ్యాలి.
No comments:
Post a Comment