Monday, March 16, 2015

నిజంగా


నమ్మలేను ..... నిజమా అని,
నిరుపయోగం ఆలోచనల్ని
ఆవేశం. మనోభావనలను
నన్ను నేను కావాలని ....
ఏ చెత్త బుట్ట లోకో
ఎప్పుడైతే, విసిరేసుకుంటానో ....
దూరం గా ఉండాలి
నీ ఆలోచనలకు అని అనుకుంటానో
సరిగ్గా అప్పుడే
అక్కడ నువ్వుంటావు.

ఊపిరాడని హృదయం భారమై,
నొప్పిని, ఎప్పుడైతే ....
తప్పించుకుందామనుకుంటానో
సరిగ్గా అప్పుడే
నాకు తెలియకుండానే నేను
నిండుగా,
నమ్మకం లేని
నెరవేరే అవకాశంపై ఆశతోనే
నీ భావనల్లో
లీనమై పోతుంటాను.


నీ కళ్ళు,
అవి విరబూసే నవ్వులూ చూసి
ఆకర్షితుడిని అవుతుంటాను.
నీకు చిరాకు కలగని విధం గా
కుదురుగా ఉండి
ఏ మాయా కాదని, నీ నవ్వు
ఆ పరిమళాలు నిజమని
తెలుసుకోవాలని పరితపిస్తుంటాను..

No comments:

Post a Comment