Sunday, March 15, 2015

ఆటవిక సమాజం లో


ఎన్నో విధాలుగా ప్రయత్నించి విసిగిపోయాను 
అతిదుష్టత్వం, క్రూరత్వం రాక్షతత్వాలను
ఆత్మనుంచి వేరుచేసి
వాటిని
విషధూమం లా బయటకు వొదిలేసి
మద్యం మత్తులో నిండుగా ముంచేసి
ఏ కాలకూట విషప్రయోగమో చేసెయ్యాలని
ఎన్నెన్ని ప్రయత్నాలో
నిద్ర, సోమరితనంలాంటి అచేతన లక్షణాలను అలవర్చి
రక్తస్రావమై అవి కారిపోయేలా చెయ్యాలని చూసాను.


అయినా,
అవకాశం దొరికినప్పుడల్లా అవి
రాత్రిళ్ళలో చెవిలో గుసగుసలాడుతూ
నా ప్రతి వినూత్న ప్రయోగమూ విఫలమై,
స్వేచ్చారహిత ఆత్మ తో .... నేను
సమాజం కోసం బ్రతికే ఒక మధ్యతరగతి మనిషిని లా ....
ఇక్కడే ఇలా
కాలం ఇరుసుపై ఆముదం తడిలా, కాలం తో పాటు
దుష్ట, క్రూర, రాక్షస లక్షణాలను కలగలుపుకుని
మట్టిని తిన్న విషసర్పాన్ని లా

No comments:

Post a Comment