కాసింత తీక్షణత తగ్గించుకుని
పశ్చిమాన
మబ్బుల చాటుకు చేరి
గులాబీ రంగును అద్దిన పిదపే
ఏదో అపసవ్యత
ఏదో వెలితి
పదాల్లో పెట్టలేని
మది గోడలపై గిలిగింతలా
ఊహాచిత్రాలు ఇంద్రధనస్సులా ఆశలు
అదో వింత ఆలోచన
నీవు
నా పక్కన పవ్వళించాలని
నా మెదడులోని రెండవ అర్ధభాగం అంతా
నిండి ఉన్నావు కనుకే అని
కేవలం, ఒక్కసారైనా
నీవూ, నేను
పక్క పక్కన
ఒక్కరులా ఉండిపోవాలి అని
నీవు నిదురిస్తూ ఉన్నప్పుడు
చూడాలి అని ....
చూడాలి ఆ నిర్మలత్వం అని .... లేస్తూనే
అలానే చూస్తూనే ఉండిపోవాలి అని,
నీ నోట తన్మయత్వ పదాలను వినాలని
అలాగే ఉండిపోవాలని
వెల్లికిలా పక్కపక్కన పడుకుని
ఎప్పటికీ .... లా
నీ చేతిని నా చేతిలోకి తీసుకుని
అలాగే .... అలా నీ కళ్ళలోకి చూస్తూ ....
మాటలులేని మనోభావం బాగుందండి.
ReplyDeleteమాటలులేని మనోభావం బాగుందండి
Deleteమౌన మనోభావనలే బాగుంటాయేమో .... స్పందన
ధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభసాయంత్రం!!