నాదొక చిత్రమైన మనస్తత్వం నీకు కనపడకుండా నన్ను నేను దాచుకుంటూ పైకి నవ్వుకుంటూ లోలోన ఏడుస్తూ ఎన్నో పోగొట్టుకుని ఏమీలేని నిరాశాజీవనం .... జీవిస్తూ
కసి .... ఏదైనా సాదించాలని నిరూపించుకోవాలని గడచిన జీవితం లో గుర్తుంచుకోదగిన జ్ఞాపకాలు లేవని అశక్తుడ్నయ్యేవరకూ ఏడుస్తూ రక్తం, చెమట ఓడుస్తూ జీవించుతూనే మరణిస్తూ
ఒంటరిగా కూర్చుని చెప్పుకుంటున్నప్పుడు నాకు నేను శ్రద్దగా వినేవారు లేరని దిగులుపడుతూ, వాస్తవం మాత్రం జీవితాన్ని పరిపూర్ణంగా ప్రతి క్షణాన్నీ నూతనం గా జీవించాలని
ఆకాశాన్ని స్పర్శించాలని ఊహల రెక్కల్ని విచ్చుకుని గగనంలో ఎగరాలని .... సాధారణంగా జీవించాలని ఉండదు. ప్రతి క్షణాన్నీ తృప్తిగా ఆస్వాదించాలని అందంగా మార్చుకోవాలని పరిసరాల్ని, సమాజాన్ని. సహచరుల భావనల్ని
నూతనత్వం దిశగా అందరూ ఆశ్చర్యపోయేలా ప్రకృతి కాలంతో పాటు మారుతున్న సమాజాన్నీ మారాల్సిన జీవితాన్నీ నేర్చుకుని మార్చుకోవాలని నేనెలా నేనులా జీవించాలో అని మనుగడకోసం ఎలా పోరాడాలో అని
సమశ్యల మంటల్లో కాలిపోతున్నప్పుడు నెర్పరితనాన్ని వర్షించే రాత్రులకు దూరంగా పురోగమించడం ఎలాగో అని నేర్చుకుంటూ కాలాన్నుంచి పాటాలు నేర్చుకుని ఆవేశం అగ్నిని రగిలించుకుని నిర్ణయాలు తీసుకోవాలని
నాకు నేను సమాధానం చెప్పుకుంటుంటాను నా దారికి ఎవరూ అడ్డం రాకుండా ప్రతి క్షణం, ప్రతి గడియ ప్రతి ఉదయమూ పురోగమనపధం వైపు కదిలేందుకు, పరుగులు తీసేందుకు ప్రయత్నిస్తూ చైతన్యం నామదేయంగా ఉండాలని .... నీ సాహచర్యం సాక్షిగా
ఇలా ఆలోచిస్తున్నానెందుకని .... అని భయపడకు! నీకు అర్ధం అయితే చాలనే .... నీ గురించి అనుకునేవు!? నాగురించి .... నేనో వెర్రివాడ్ననే, కలల మేడలు గాలిలో కట్టుకుంటున్నాననే,
ఎప్పుడైనా పిచ్చివాడ్నిలా కనిపిస్తుండొచ్చు మరిచిపో! పట్టించుకోకు .... అంతే! దూరంగా మాత్రం పారిపోకు వెళ్ళిపొమ్మని చెప్ప లేను మన జీవితాల కథ అనుకోమంటాను కానీ.
నాకు నీపై నమ్మకం నీ నమ్మకాన్నై, నీ ధైర్యాన్నై నీ పక్కన .... నీడలానైనా నిలబడిఉండాలని ఉంటుంది. వాస్తవ అస్తిత్వాన్నై నన్ను నన్నుగా అంగీకరించబడేందుకు వీలుగా.
ఓ చెలీ! నన్ను నమ్ము! ఎన్నిసారులో, ఎన్ని విధాలు మనసువిప్పగలనో అర్ధం కావడం లేదు ..... అర్ధం కావడం లేదు, ఎక్కడికి వెళ్ళాలో ....?
నీవు కలిసాక కళ్ళు తెరిచాక తెలుసుకున్నాను. నేనూ నా అస్తిత్వం ఏమిటో? నా గమ్యం ఏమిటో? నీవు ఎక్కడి నుంచో వచ్చావు ఇక్కడే నాకు దగ్గరయ్యావు. బహుశ నన్నుద్దరించేందుకే అయ్యుంటుంది.
నేను నమ్ముతున్నాను. నీ సాహచర్యం లో నా, నీ జీవన పురోగమనం సాధ్యమని
నా ఈ వింత ఆలోచనల్ని చూసి వెర్రివాడినని భయపడకు. నా మాట విను చూడు. నన్ను నమ్మి చూడు నా నమ్మకం చత్రం క్రిందకి .... వచ్చి నన్ను నన్నుగా గుర్తించి, నమ్ము! నన్ను నన్నుగా .... ఓ చెలీ!
వీలైతే విప్పుకుని తీసుకోగలిగినదైతే నీ బాధ నీ నొప్పి నీనుంచి దూరం చేసేందుకు ఆ నొప్పిని తీసుకుని నీకు దూరంగా వెళ్ళి వదిలించుకునేందుకు దాన్ని ఏ బండరాయికో బలంగా ముడేసి ఏ హుస్సేన్ సాగర్ లోనో ఏ మూసీ మురుగులోకో విసిరేసి నిష్క్రమణమయ్యేవరకూ ఉండి వెనక్కు తిరిగొచ్చి నీ అందమైన చిరునవ్వుల ఎదురుచూపులను తలుపులు తెరుస్తూనే నీ చూపుల్లో నమ్మకాన్ని అంతా సవ్యమే కదా అన్న భావనను చూడాలనుంటుంది.
వీలైతే నిజంగా నేను నీ నొప్పిని నాతో తీసుకు వెళ్ళగలిగితే నీ బాధను నీనుంచి దూరం చెయ్యగలిగితే
అసత్యాల బోనులో రహశ్యాల నీడలో నివాసం చేస్తూ ముక్కలైన సరళత నిలకడలేని ఆలోచనలతో అంతరంగంలో లోలో .... సంచరిస్తూ ఎదురుపడిన పారదర్శకత లేని నవ్వులు, భయానకమైన నిట్టూర్పులు ఆరంభ వికృత మనశ్చిత్రం తో సత్య దాపరికం, మోసపుటాలోచనల వాంతులు జీవితంలో విముక్తిని పొందాననుకోను. శిక్షే అనుకుంటాను.
శరీరం గడ్డకట్టిన చల్లదనం మసక మసక పరిసరాలు జన్మలు యుగాలు గడిచి నేను మాత్రం మారనట్లు నా ఉనికి మారనట్లు వర్ణంతప్పిన కలల్లోనే నేనింకా విహరిస్తున్నట్లు ఆత్మ గౌరవం అనర్ధమై .... బాధ, విషాదాల నీడలు నన్ననుసరిస్తూ .... నా రక్తంలో దిగులు లక్షణాలు ప్రవహిస్తూ నేనేనాడో చచ్చ్చిపోయినట్లు, ప్రేమించబడకుండానే
నీ చుట్టూ నీడలు గుంపుల్లా ముసురుతూ వడపోసిన ఆ వెన్నెల కాంతి నీ మేనిపై జారుతూ ఏదో వింత మెరుపు నూతనత్వం, మార్పు .... నీ కదలికల్లో ఆ వెన్నెల, నీడ లు పరావర్తన చెంది అధ్యయనం చెయ్యాలనిపించుతూ చాయాచిత్రం లా నీవు ఆ ఆకర్షణ, వికర్షణ వ్యత్యాసాల దూరం పెరుగుతూ స్వయం చాయ లా .... నీవు
భయం నాలో, నీవు గమనిస్తావేమో అని, నా .... బలహీనతల్ని, మొహమాటాల్ని, సాగదీతల్ని దేన్నీ కడుపులో దాచుకోలేని నా మనోలక్షణాన్ని కనపడకుండా దాచుకునున్న ఏదో నొప్పి నీకు కనిపిస్తుందేమో అని,
నేను మాట్లాడితే వినాలనుంటుంది నీకని తెలుసు .... కానీ, భయం మాట్లాడటం మొదలుపెడితే మాట్లాడటం ఆపనని ఆశలను ఏకరువు పెడతానేమో కోరికలను కక్కేస్తానేమో అని
ఆర్ధిక స్వాతంత్రం లేని ప్రేమ అపభ్రంశం పాలౌతుందనే భయం ఉంది లోలోపల నీవు నా జీవితం లో ఒక భాగానివైనట్లు నీవు నన్ను చూస్తున్నప్పుడు నీ కళ్ళలో ఆ నమ్మకం నాకెంతో ఇష్టం! ఆక్షణాల్లోనే నీతో కలిసి ఎగిరిపోవాలనిపిస్తుంటుంది. ఎగిరేందుకు ఊహల రెక్కలు .... తెచ్చుకోవాలనుంటుంది.
ఆఖరి క్షణం లోనైనా నిన్ను చేరగలనా అనిపిస్తూ చేరేందుకు ప్రయత్నించాలని పట్టుదల .... కానీ భయం నాలో .... నువ్వెక్కడ దూరమైపోతావో అని నా రహశ్యాలు భయాలు నీముందు పరిస్తే .... నా హృదయపు దడలో, నా ప్రతి శ్వాసలో నా కలల్లో ఎప్పుడూ నీవేఉన్నావని ఎక్కడ తెలుస్తుందో అని,
మాట్లాడటం మొదలుపెడితే మాట్లాడుతూనే ఉంటాను నేను నిన్ను ప్రేమిస్తున్నాననే నిజం నీముందు ఎంతకాలమో దాయలేను. ఎన్నాళ్ళనుంచో నీవు నా కోసం ఎదురుచూస్తున్నావని తెలుసని నీతోనే చెప్పేస్తానని భయం నాలో
ఇంకా స్థిరపడని నేను, న్యాయం చెయ్యగగలనో లేనో అనే ఆలోచన, భయమే నాలో అంతటా .... కానీ, నీవు నా జీవితం లో లేవు అనే ఆలోచనను మించిన భయమా ....? ఆలోచిస్తుంటే భయమేస్తుంది మరింతగా .... నిజం నిజంగానే వెళ్ళిపోవాలనుకున్నాను. వెళ్ళలేకే ఉండిపోయాను నీ కోసం
అతని చూపుల్లో, అతని మాటల్లో అతను పెదవులు కదిల్చే విధానం లో ఏదో ఆకర్షణ మోహితురాలై .... ఆమె ఆగింది అతని ప్రయత్నాలు చూసి అతనిలో సాదించాలనే ఆ పట్టుదలను చూసి మారాలి మారతాను అని అతను తనకు తాను చెప్పుకోవడం చూసి ప్రేమ మోహ అస్పష్ట భావనావస్థల్లో అతను .... ఎలా దగ్గరకు తీసుకుంటాడో బాహువుల్లోకి అని .... ఊహిస్తూ, ఆమె ఆగింది. అతనితో ఆమె వివాహం జరగొచ్చని ప్రేమ దొరకొచ్చనే ఆగింది ఆగాలనిపించే కష్టాలు గడ్డురోజులు వస్తాయి, పోతాయి అనే అబౌతికమే మిగిలేది అనే ఆగింది ఆలోచిస్తూనే ఉంది ఆమె ఆగింది .... ఆగుదామనిపించే ఆమెకు నమ్మకం కుదిరింది. కోరిక ఫలించింది.
అతను మారాడు. మారాక కూడా అతను ఆనందంగానే ఉన్నాడు. ఇన్నాళ్ళూ ఆమె అతన్ని ప్రేమించింది. ఇప్పుడు అతనూ ప్రేమిస్తున్నాడు. ప్రేమ, మోహ భావనలతో పరిణయ వేళల కోసం ఆమె ఆగింది .... ఆగిపోవాలనే సహధర్మచారిణై మిగిలిపోవాలనే .... అతనితో
కదలలేము. కంటినిండా కునుకుండదు భయాన్ని పారద్రోలకపోతే .... నీరసపరచి నిశ్చేష్టుల్ని చేసి ప్రతి పనిలోనూ జోక్యం చేసుకుని పులుముకుపోయే ఏ అడవి పూ పరిమళమో భయం,
అతి ప్రమాదకర తడబాటు, ఘోర, అమిశ్రమ లక్షణం అస్తిత్వ వ్యక్తిత్వ నాశని, తాడుపామై నీడ మృత్యువయ్యే భావన భయం ....
మూడొంతుల జీవితం అందరిలోనూ మురికి అసహ్య అనుభవాలమయం గతం, వర్తమానం .... భయం భూతం ఆత్మస్థైర్యం నమ్మకం దూరమై అర్ధం తెలియని నిర్దయ భయం
భయమే నిన్నూ, నన్నూ, అందరినీ .... తెరచాటునుండి అశక్తుల్ని అచేతనుల్ని దోషుల్ని చేస్తుంది .... అధిగమించి పోరాడని జీవాల్ని. అందుకే జీవించేందుకు అవసరం .... భయం పై జయం
చీకటిలో తోడెవరూ లేని రహదారిలో ఒంటరినై కల కంటున్నట్లుంది.
ఏది తప్పో ఏది ఒప్పో రహదారి ఎటు తీసుకు వెళుతుందో ఎంతవరకు వెళతానో .... అసహనం మదిలో
నీవు నా మది వాకిలిలో ఆలోచనల కళ్ళాపీవై తుడిచి వెయ్యలేను. మరిచిపోలేను
మదిపొరల్లో జ్ఞాపకాల పునాదుల్లో తిష్ట వేసి పాతుకుపోయావు మూలానివై గమనించినా కదిలించలేను.
అంతా అయోమయం, అంధకారమే ఉక్కిరిబిక్కిరైపోతూ దిక్కుతోచని ప్రయాణమే
నా జీవితం నా ఇష్టం ప్రకారం ఒద్దికగా క్రమశిక్షణతో నడుచుకోవాలనుంది.
అందుకు, నీ సహకారం కావాలి. దయచేసి నా మది పొరలను నీవు ఖాళీ చెయ్యాలి.
నీకు ఎలాంటి భావనలూ లేవని తెలిసింది. నీలో కరుణ లేదని అర్ధం అయ్యింది. అందుకే, ఈ రాత్తిరి ఈ రహదారిలో ఇలా ఒంటరిగా ..... నేను,
ఏదో పట్టుదల నిన్ను దూరంగా తరిమెయ్యాలని నా బాధలు నా కన్నీళ్ళు నేనే తుడుచుకోవాలని
నీవు నన్ను అలా నిశ్చేష్టుడ్ని, వొంటరిని చెసి వెళ్ళిపోయేప్పుడు బహుశ నేను కనిపించలేదేమోనని ఏ నీడలానో ఉండుంటానని సరిపెట్టుకోలేను.
సామాజిక కర్తవ్యోన్ముకుడ్నైనా అయ్యేందుకైనా నా జ్ఞాపకాల్లో, ఆలోచనల్లో ఎక్కడో .... అక్కడి నుంచి కూడా నన్నొదిలి వెళ్ళిపో నీవు మదిలో ఉన్నంతకాలం నాకు ఊపిరాడదు.
నా జీవితాన్ని నేనుగా నడవనీ నా ఆలోచనలకు అందనంత దూరంగా వెళ్ళిపో ఈ ఒంటరి రహదారిలో స్వీయ ఆలోచనలతో ఒంటరిగానే నన్ను నడవనీ
నీ జ్ఞాపకాల గతం .... ప్రేమ భావనలు నన్ను చెదలా తినెయ్యక మునుపే బ్రతకాలనుకుంటున్న నన్ను నన్నుగా బ్రతకనీ ఇప్పటికైనా నా ఆలోచనల్లోంచి .... వెళ్ళిపో దూరంగా
ప్రేమంటే, ప్రియభావనంటే ఏమిటో తెలుసా? సిగ్గుకూ, అలుకకు అర్ధం తెలియనంతవరకూ ఎవరీ ఆనందం కోసమో నిన్ను నీవు సర్వం కోల్పోనంతవరకూ ప్రేమానురాగ బంధాల అర్ధం .... తెలుసా నీకు?
ముద్దాడిన పెదవులు గాయపడతాయని చెల్లించాల్సిన మూల్యం అమితం అని శూన్యం అయిన హృదయం .... ఒంటరితనం లో వేదనలో తియ్యదనం వెదుక్కునేంతవరకూ ప్రియరాగం వెలువెంతో తెలియదని .... తెలుసా నీకు?
శూన్యమైన గుండె పరితపించేవరకూ .... తెలుసా నీకు? స్మృతుల, ఆలోచనల గతం అనుభూతుల్లో నిలువెల్లా మునిగి ఊపిరిని కోల్పోయేవరకూ పెదవులు వెచ్చని కన్నీటిని రుచి చూసాక కానీ ముద్దు రుచిని కొల్పోయిన నిజం తెలిసిందని,
అగ్నికీలల్లో మండిన గుండె అస్తిత్వం గురించి .... తెలుసా నీకు? ప్రేమ కోసం కాలంతో పోరాటంలో మరణించనూలేక జీవించనూలేక నిద్దురలేని ఎదురుచూపుల నిరీక్షణలో కానీ అర్ధం కాలేదని .... ప్రేమంటే ప్రియరాగం అంటే అని,