Saturday, November 2, 2013

అయితే ....

నేను, ప్రకృతిని స్పృశిస్తున్నాను.
మట్టి వాసన ను ఇష్టపడుతున్నాను.
ఎవరో ఆ నక్షత్రాలు
గ్రహాల్ని తాకుతున్నారని తెలిసీ
ఈ వాస్తవ,
ఊహా జగత్తు లో
నిన్ను లో నన్ను కలుపుకుంటున్నాను.
నా (జగత్‌) వ్యవస్థవు
నీ సమక్షంలో
చాలా చిన్నవాడ్ని
నీ గురించి నేను తెలుసుకుంది ఏమీ లేదు
అయినా
ఒక్కటి మాత్రం నిజం
దూళితో సహా నిన్ను ఆస్వాదిస్తూ
నీ ఒడిలో నిద్దురపోతున్నాను.
ప్రేమ వృక్షాన్నై మొలకెత్తాలని.







2 comments:

  1. అద్వితీయ భావన అమరత్వాన్ని ఆపాదిస్తుంది అంటారు, ఒక్క్కోసారి మీ కవితలు చూసినప్పుడు వాటిని వ్యాఖ్యానించటానికి నేను తగనేమో అనిపిస్తుంది,
    సర్, ఏది ఏమైనా... చిన్ని మాటలుగా అనిపించినా ఉన్నత భావాన్ని పొందుపరుస్తారు, అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. "అద్వితీయ భావన అమరత్వాన్ని ఆపాదిస్తుంది అంటారు, ఒక్క్కోసారి మీ కవితలు చూసినప్పుడు వాటిని వ్యాఖ్యానించటానికి నేను తగనేమో అనిపిస్తుంది,
      సర్, ఏది ఏమైనా... చిన్ని మాటలుగా అనిపించినా ఉన్నత భావాన్ని పొందుపరుస్తారు, అభినందనలు." .... మీ అభినందనను ఒక గొప్ప కాంప్లిమెంట్ అనుకుంటాను. తడబడుతున్న అడుగులకు మీలాంటి కవయిత్రుల ప్రోత్సాహం అవసరం
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! మీకు నా దీపావళి పండుగ శుభాకాంక్షలు.

      Delete