Monday, November 25, 2013

నాకు స్వేచ్చ కావాలి


యుద్ధం అంటే భయంతో కాదు.
యుద్ధాన్ని ఆక్షేపిస్తున్నాను.
ఎవరినో చంపాల్సొస్తుందనో
ఎవరి చేతిలోనో చావాల్సొస్తుందనో .... కాదు.
చంపడం, చావడం అతి స్వల్ప విషయాలు.

కానీ,
నా స్వేచ్చను, నా హక్కుల్ని
కోల్పోతున్నానే .... అదీ అభ్యంతరం.

కాలనీలో మారుమూల
ఓ చిన్న గదిలో, ఆకలికి మాడుతూ,
అప్పుడప్పుడూ,
ఏ చవకబారు సారానో తాగుతూ,
వీధుల్లో వీరంగం చేసి
సావకాశంగా బలాదూర్లు తిరగే స్వేచ్చను,
పౌరుడిగా నా హక్కును కోల్పోవాలని లేదు.


3 comments:

  1. బాగుందండీ.. యుద్ధ్ధాన్ని నిరసించడానికి ఈ కారణం.

    ReplyDelete
  2. బాగుందండీ.. యుద్ధ్ధాన్ని నిరసించడానికి ఈ కారణం. ....
    బాగుంది స్పందన ఒక ప్రోత్సాహక అభినందన
    నా బ్లాగు కూ స్వాగతిస్తూ .... ధన్యాభివాదాలు బుజ్జి గారు!

    ReplyDelete