Sunday, November 3, 2013

అసమర్ధుడి అపజయం

ఇప్పటికీ నేను అశక్తుడ్నే. ఏమీ చెయ్యలేను. 
ఉరుముల్లా రాలుతూ ఉన్న ఇల్లాలి కళ్ళలో నీళ్ళు 
పిల్లల కళ్ళలోకి సూటిగా చూడలేక 
ఖాళీ గిన్నెలో కి  నిశ్చేష్టుడ్నై చూస్తున్నాను.
నాకు పైరవీలు చెయ్యడం రాదు. 
మధ్యవర్తినై బేరసారా లాడ లేను. 
అడుక్కోవడం రాదు. దొంగిలించే నైపుణ్యమూ లేదు. 
చిల్లు జేబులు చేసిన అప్పులతో అడుగు బయట పెట్టలేను. 
నులకమంచం మీద శల్యావస్థ లో అనారోగ్యం .... నా కూతురు 
వైద్యం చేయించలేను. రోగాన్ని పారద్రోల లేను. 
పసిదాని ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే,
చూస్తూ అల్లల్లాడటం మినహాయించి. 
చెయ్యగలిగిన దారి ఏదీ కనిపించడం లేదు. 
ఆకలి, నిస్సహాయత నన్నూ, నా సంసారాన్నీ ఆవహించి 
ఏమీ చెయ్యలేని, ఈ అసమర్ధ జీవితాన్ని అసహ్యించుకుంటున్నాను తప్ప.





6 comments:

  1. నో... అసమర్దత జీవితానిది కాదు, ఆలోచనా విదానానినిది,
    మీ కవితలో తనపై తానే సానుబూతి చూపుకునే అసమర్దుని చూపారు వానికి జీవించే విదానాన్ని నూరిపోయండి మాస్టారూ.

    ReplyDelete
    Replies
    1. "నో! .... అసమర్దత జీవితానిది కాదు, ఆలోచనా విదానానిది, మీ కవితలో తనపై తానే సానుబూతి చూపుకునే అసమర్దుని చూపారు వానికి జీవించే విదానాన్ని నూరిపోయండి మాస్టారూ." .... స్పందన ఒక సూచన స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు.

      Delete
  2. I think It is the philosophical soliloquy of our prime minister :-)

    ReplyDelete
    Replies
    1. నేను ఇది మన ప్రధాన మంత్రి :-) యొక్క తాత్విక స్వగతముగా భావిస్తున్నాను .... అన్న మీ స్పందన లో పరిశీలనాత్మక దృష్టిని అభినందించకుండా ఉండలేక పోతున్నాను. మీ అన్వయానికి .... ధన్యమనొభివాదాలు హరి ఎస్ బాబు!

      Delete
    2. కృతజ్ఞతలు. కానీ కవిత చాలా సిన్సియర్గా ఉంది. ప్రతి మధ్యతరగతి జీవీ యెప్పుడో ఒకప్పుడు ఈ రకమయిన స్తితిలోకి వస్తాడు.కాకపొతే అందరూయెక్కువకాలం ఉండరు(మన లాంటి వాళ్ళం). అలా ఉన్నవాళ్ళు జీవితాల్ని ముగించేసుకుంటున్నారు. కవిత అర్ధంలో స్థితిని ప్రతిబింబించడం వరకూ బాగుంది.

      Delete
    3. కృతజ్ఞతలు. కానీ కవిత చాలా సిన్సియర్ గా ఉంది. ప్రతి మధ్యతరగతి జీవీ యెప్పుడో ఒకప్పుడు ఈ రకమయిన స్తితి లోకి వస్తాడు. కాకపొతే అందరూ యెక్కువ కాలం ఉండరు (మన లాంటి వాళ్ళం).
      అలా ఉన్నవాళ్ళు జీవితాల్ని ముగించేసుకుంటున్నారు. కవిత అర్ధంలో స్థితిని ప్రతిబింబించడం వరకూ బాగుంది.
      మీ విశ్లేషణాత్మక స్పందన చాలా గొప్పగా ఉంది హరి ఎస్ బాబు! సమాజం లో ఉన్న స్థితిని ఒక అబ్జర్వర్ లా ఆవిష్కరించడం ఒక ఎత్తైతే పరిష్కార మార్గం చూపించడం ముఖ్యం అని ఒక సీనియర్ కవయిత్రి గారు కూడా స్పందించడం జరిగింది. ఆలోచింపచెయ్యడం తో బాధ్యత తీరదనే మీ వ్యాఖ్యలతో కొంతవరకే నేను ఏకీభవిస్తాను.
      నమస్సులు హరి ఎస్ బాబు!

      Delete