Wednesday, October 7, 2015
Tuesday, October 6, 2015
అన్యాయమే సుమా
నాలో మిగిలి ఉన్న
కాస్తంత మంచితనాన్ని కూడా
ప్రలోభపెడుతూ
నీ లోని స్వచ్చత
ఒక ఆశావహ పరిపూర్ణతై
నీ స్పర్శతో
నాలో ఎన్నెన్నో వింత మార్పులు
నా న్యాయ విరుద్ధపు
అవినీతి ఆలోచనలు, వాటితో పాటు
నేనూ ప్రభావితమై
న్యాయ
ధర్మ రూపిణివై నీవు
ఎప్పుడూ తప్పులు మాత్రమే చేసే
దుష్ట రాక్షస ప్రవృత్తి
రూపాన్నై నేను
నా ఎండిపోయిన పెదాలమీంచి
దొర్లిన
ప్రతి నిరుపయోగ పలుకు అర్ధమూ
నీవు ముద్దాడుతూనే
పరమ పవిత్రంగా మారి
నా నరనరాల్లోనూ మంటలు
విపరీతత్వం, పోషించబడిన వక్రబుద్ధి
దహించుకుపోతూ
ప్రేమ, గాంభీర్యమూ
ఒకదాన్నొకటి వ్యతిరేకిస్తూ
ఈ అనిశ్చితి
ఎందుకో?
ఒక ఓడిపోయిన ప్రేమికుడ్నై నేను
లొంగిపోయి
తలొంచుకుని నీ ముందిలా
Monday, October 5, 2015
Saturday, October 3, 2015
ఒక అవసరం జీవితం
నీది నొప్పులు బాధల మయ జీవితం
నేను నీ కళ్ళలోకి చూస్తున్నాను
"కాస్తంతైనా కుదుటపడ్డావా" అని.
నీతో ఉండటము చూడటమూ వల్ల
నాకు పెద్ద లాభమూ నష్టమూ లేవు.
నీవేం ప్రత్యేకం కాదు .... నాకు
అయినా పక్కనే ఉన్నాను.
కారణం ఏదైనా కాని
నీ భయానికి మాత్రం కారణం నేనులా
నన్ను నమ్మి మోసపోతావేమో అన్నట్లు
దీనంగా చూస్తున్నావు.
కానీ నీవు నమ్మక తప్పదు
నీ జీవనానికి నా అవసరం ఉన్నా
నాకు ఇచ్చేందుకు నన్నాశకొల్పేందుకు
నీవద్ద ఏమీ లేవు.
ఏమీలేని దాని వై, ఎవ్వరికీ కాని దానివై
నీరసంతో నీవు సొమ్మసిల్లుతూ
చూస్తూ ఉన్నాను.
నీ ప్రపంచం ఎలాగూ నాశనం అయ్యింది.
నీ కలలన్నీ అబద్దాల కన్నీళ్ళయ్యాయి.
నీ పక్కన ఉండి నేను మాత్రం
నా సమయాన్ని వృధా చేసుకోవడం లేదు కదా అనే
మీమాంస ఉన్నా తప్పదు
వైద్య వృత్తి ....
నీవో అనామకురాలివి.
నొప్పి బాధల్ని శరీరమంతా నింపుకున్న అభాగ్యురాలివి.
నీకే తెలియదు భవిష్యత్తులో ....
ఎందుకు ఏ ఆశతో జీవించాలో
నీవింకా బ్రతికున్నది ....
నీవు కన్న అందమైన ఆత్మల్ని చూసుకునని
నీ ఇద్దరు బిడ్డల కోసమే అని
వారు, వారి కోసం నీవు ఏమీ చెయ్యలేదని
అనుకోకూడదనే ఈ భారజీవితాన్ని ఈడుస్తున్నావని,
శూన్యం నీవై శూన్యంగానే ఉండి ఎప్పటికీ ....
ఏ మాత్రం కష్టం కాదు ఎవరికీ .... నీ ఈ స్థితిని చూడటం
లోలోన నీవు చచ్చిపోయి
రోధిస్తూ ఉన్నావు.
ఒక జీవిత కాలం అబద్దాలతో సాహచర్యం చేసి
ఇప్పుడు నిన్ను రక్షించాల్సిన బాధ్యత నాది.
కానీ ఏమిటి ప్రయోజనం? ఏమిటి లాభం!?
నీవేమో చావును కోరుకుంటూ
నేనేమో నీకు వీడ్కోలు చెప్పాలని లేక
ప్రియ మానసీ .... నిన్నే
"ఔనూ నిజంగా నేనీ క్షణాన ఇలానే మరణిస్తే ఏమౌతావు? ఎలా ప్రతిస్పందిస్తావు?" అన్నాను.
"అయ్యో దూరమయ్యావే .... ఇలా జరక్కుండా ఉంటే బాగుండేది" అంటాను. అన్నావు.
అప్పుడు వెంటనే, "మానసీ నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా!?" అన్నాను.
వెంటనే నీవు, "నిజంగా నాకూ తెలియదు." అన్నావు. ఊపిరి ఆగినంత పని అయ్యింది.
"నేను నీకు విడమర్చాలనుకుంటున్నాను మానసి" అన్నాను. నేనెరిగిన సంగతులు, వాస్తవాలు
"నీకూ తెలుసు నేను నిన్నెంత ఘాడంగా ప్రేమిస్తున్నానో
నీవే ఎప్పుడూ ప్రతిగా నన్ను ప్రేమించలేదు .... నిజం కాదా?" అన్నాను.
ఇలా మాట్లాడుతున్నానని అనుకోకు, నేను భావోద్వేగం లో మాట్లాడుతున్నాననుకుని అని
"ఎప్పుడైతే నీవు నీ మనసును స్వచ్చందంగా నా ముందు విప్పలేదో .... అప్పుడే
అవసరం ఏర్పడ్డప్పుడు మాత్రమే ఒక్కోసారి ఒక్కో అబద్దం ఆడావో .... అప్పుడే తెలుసు.
నాకు తెలిసే నీకు సహకరించాను .... ప్రతిసారీ నీవు పనయ్యిందని సంతోషపడ్డప్పుడు
నన్ను చూసి నీవు నవ్వుకున్నప్పుడు, నేను ఎంతగా రోధించానో .... నీకు తెలుసా?"
మళ్ళీ అన్నాను. "నాకు తెలుసు, మన బంధం తెగకుండా, పవిత్రంగా ఉంచుకునేందుకు
నేను ఎంతగా తపన చెందానో, అలవికాని సమశ్యలను ఎన్నింటిని నెత్తిన వేసుకుని మోసానో
అంతే తేలిక గా నీవు తెంచుకున్నావు." "నీ చేతిలో నన్ను .... ఒక బొమ్మను చేసుకుని
నీ ఆనందం చూసి, ఇనుమటించేందుకే నువ్వాడే ఆటలో నేను తోలుబొమ్మనయ్యాను." అని
"ఒక్కసారి వెనుదిరిగి చూడు! నేనెరుగనని నీవు అనుకుంటున్న అన్ని నిజాలూ నాకు తెలుసు.
అంతే కాదు నువ్వెంత పిచ్చిదానివో .... ఎలా తెలివితక్కువ దానివో!"
చివరి లక్షణం గా నేను గమనించింది నిర్ధారణ కొచ్చిందీ మాత్రం
"ఔనూ ఎలా సాధ్యం? అనే .... అమృతమూర్తివి అనుకున్న నువ్వింత దయారహితవు ఎలా!?" అనే
Friday, October 2, 2015
నీ ప్రేమ కావాలి
ప్రతి రాత్తిరి, ప్రతి పగలూ
అది నీ కోసమే అని .... నీకు తెలుసో లేదో!?
ఎప్పుడూ .... నేను కల కనేది నిన్నేనని.
సున్నితంగా దిద్దబడిన నుదురు,
ముఖ వర్చస్సుల సౌందర్యం
ప్రకాశం, ప్రేమ వెలుగులా
నీవు నా హృదయం లో
ఎదిగి వ్యాపించావని
లోలోతుల్లో నీవే అన్నీ అయి
నా ఆలోచనల్లో, ఆవేశంలోనూ అని
నా జీవితము, నా ప్రేమ సర్వమూ
నాతోనే ఉన్న భావన .... నాలో
నీవు పక్కన ఉన్నప్పుడు ....
అన్నీ సవ్యంలా
ఒడుదుడుకుల తప్పులన్నీ అకశ్మాత్తుగా
ఒప్పులుగా .... స్పష్టంగా కనిపించి
నా హృదయం నీ భావనల తో
ఆలోచనలతో నన్ను ప్రభావితం చేసి
నీవే వెనుక ఉండి నన్ను నడిపిస్తున్నట్లు
నా ప్రేమను స్వంతం చేసుకున్నట్లు
నన్ను ప్రభావితం చెయ్యగలిగింది..
ఒక్క నీవు మాత్రమే
నమ్మేలా
ప్రేమను, నన్ను నేను .... మరొక్కసారి
నాకు తెలిస్తే చాలు
భవిష్యత్తులో నీ సాహచర్యం నాదే అని
ఈ జీవిత కాలం
ఎందరో స్నేహితులు మనల్ని
అర్ధం చేసుకోలేక పోయుండొచ్చు
నీవూ నేనూ మాత్రం
పూర్తిగా అర్ధం చేసుకున్నాము.
అది చాలు
నేను ఎదురుచూస్తున్నది
వెదుకుతున్నది .... ఈ సాంగత్యం కోసమే
ఈ సాహచర్యం కోసమే
ఎంత తాగినా తీరని దాహం
నీ ప్రేమామృతం పొందడం కోసమే ....
ఒంటరినై తియ్యని బాధను తపిస్తూ
నీ వద్దకు వస్తుంది. నిన్ను విసిగిస్తుంది.
నవ్వుతూ పరామర్శిస్తుంది.
కలలోకొచ్చి కలవరపరుస్తుంది..
ఎంత పొందినా .... చాలని
మరింత ప్రేమను పొందడం కోసమే
Subscribe to:
Posts (Atom)