ఆనందం మసకేసిపోయి నేనో వెర్రివాడిని అయిపోయి ఏ చిన్న నొప్పినీ తట్టుకోలేని శరీరం మండిపోయిన ఆ అనుభూతి క్షణాలు ఎప్పుడు ..... ఈ బాధ, ఈ జీవితం నుంచి విముక్తిని పొందుతానో అనిపించిన ఆ రోజుల్ని మరిచిపోవాలని ప్రయత్నించీ మరిచిపోలేను. నిరాశ, నిస్పృహల అగాధాల్లోకి ఎక్కడికో జారి పడిపోతూ ఉక్కిరిబిక్కిరై ఊపిరాడని ఆ క్షణాలు మరిచిపోలేను.
గాలి కోపగించుకుని దూరంగా కదలి వెళ్ళిపోయిన ఆ అనుభూతిని లోపల హృదయం విచ్చిన్నమైపోయి మొహమాటపు ఆచ్చాదనం పెచ్చులు ముఖంపైనుంచి ఊడిపోయి బలవంతపు నవ్వేదో ముఖం పై నీడలా నర్తించిన ఆ క్షణాలు మరిచిపోలేను .... ఎంత ప్రయత్నించినా,
నమ్మలేను ..... నిజమా అని, నిరుపయోగం ఆలోచనల్ని ఆవేశం. మనోభావనలను నన్ను నేను కావాలని .... ఏ చెత్త బుట్ట లోకో ఎప్పుడైతే, విసిరేసుకుంటానో .... దూరం గా ఉండాలి నీ ఆలోచనలకు అని అనుకుంటానో సరిగ్గా అప్పుడే అక్కడ నువ్వుంటావు.
ఊపిరాడని హృదయం భారమై, నొప్పిని, ఎప్పుడైతే .... తప్పించుకుందామనుకుంటానో సరిగ్గా అప్పుడే నాకు తెలియకుండానే నేను నిండుగా, నమ్మకం లేని నెరవేరే అవకాశంపై ఆశతోనే నీ భావనల్లో లీనమై పోతుంటాను.
నీ కళ్ళు, అవి విరబూసే నవ్వులూ చూసి ఆకర్షితుడిని అవుతుంటాను. నీకు చిరాకు కలగని విధం గా కుదురుగా ఉండి ఏ మాయా కాదని, నీ నవ్వు ఆ పరిమళాలు నిజమని తెలుసుకోవాలని పరితపిస్తుంటాను..
ఎన్నో విధాలుగా ప్రయత్నించి విసిగిపోయాను అతిదుష్టత్వం, క్రూరత్వం రాక్షతత్వాలను ఆత్మనుంచి వేరుచేసి వాటిని విషధూమం లా బయటకు వొదిలేసి మద్యం మత్తులో నిండుగా ముంచేసి ఏ కాలకూట విషప్రయోగమో చేసెయ్యాలని ఎన్నెన్ని ప్రయత్నాలో నిద్ర, సోమరితనంలాంటి అచేతన లక్షణాలను అలవర్చి రక్తస్రావమై అవి కారిపోయేలా చెయ్యాలని చూసాను.
అయినా, అవకాశం దొరికినప్పుడల్లా అవి రాత్రిళ్ళలో చెవిలో గుసగుసలాడుతూ నా ప్రతి వినూత్న ప్రయోగమూ విఫలమై, స్వేచ్చారహిత ఆత్మ తో .... నేను సమాజం కోసం బ్రతికే ఒక మధ్యతరగతి మనిషిని లా .... ఇక్కడే ఇలా కాలం ఇరుసుపై ఆముదం తడిలా, కాలం తో పాటు దుష్ట, క్రూర, రాక్షస లక్షణాలను కలగలుపుకుని మట్టిని తిన్న విషసర్పాన్ని లా
ఎముకల గూళ్ళు పై కప్పిన చర్మం, శిలలు, గులకరాళ్ళ కొండలు ధరించిన శరీరాల ఆత్మలు దూళిమయమై .... నేల రాలి, నాశనమై, ఈ నేల కోసం ఎదిగి, తిరిగిన గృహాల నీడలలో కలిసి నడిచేందుకు పోరాడుతూ ...... అందమైన ప్రపంచంలో నివసించేందుకు ఆనందం సమాజం చిరునామాలయ్యేందుకు చేతిలో చెయ్యేసి కలిసి, కదులుతూ ఏ ఆలోచననూ కాదనుకుని ఎక్కడికీ పోలేక ప్రతి ఒక్కరూ మరొకరి తోడుతోనే
ఆమెకు తెలిస్తే బాగుంటుది. నన్ను నేను మరిచిపోతుంటాను. తన పక్కనున్నప్పుడు .... అని, తనను కోల్పోతానేమో అనే నా మనోభావనలు తన చెవిలో గుసగుసలాడాలనిపించి ఆ .... చిత్రమైన ఆకర్షణ అగ్ని, అగ్ని బూడిదైన పరిణామం అనుభూతి బాధో, వేదనో .... ఏ అనుబంధమో తనకు అర్ధం అయ్యి అనిపిస్తే చాలు .... అందుకు కారణం తనే అని.
నేను నీ పక్కనే .... కష్టాల్లో, సుఖాల్లో అంతం, స్వార్ధం లేని, స్నేహం లా బలహీనురాలివయ్యినప్పుడు నీవు ముందుకు కదలడానికి బలాన్నై
పిలిస్తే, నీ పక్కన ఉంటాను. భయపడకు! నమ్ము! మాటిస్తున్నాను నీకు తగిలిన గాయాన్ని చూడగలుగుతున్నాను..
నీ నొప్పిని అనుభూతి చెందగలుగుతున్నాను. బాధలు, కష్టాల వర్షం లో తడుస్తున్నప్పుడు చుట్టూ అంతా చీకటిలానే కనిపిస్తుంది. నీవు చూడగలవు, వెలుగుల్ని, కాంతిని, ఆశను,
ఎప్పుడైనా అనిపిస్తుంటుంది. తోడుండాలని, అప్పుడు ఎవరూ తోడుండరు. ఎవరూ తోడు లేరని, రారని, ఒంటరులమని నీరసపు ఆలోచనలువస్తే, ఆ ఆలోచనల్లోంచి బయటికి రా!
మనలో, మన ఎద కదలికల్లో, లయలో ఎక్కడో .... విశ్వాసం, ప్రేమపట్ల మనోభావనలకు ప్రాణంపోస్తూ ఒక నిర్వికార రూపం అక్కడే వెతకాలి. ప్రేమ స్వరూపాన్ని, సూర్య కాంతి వెలుతురును.
మన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు అక్కడ దొరుకుతాయి. జీవించాలి, అనే భావన ఎంత బలమైనదో, అంతే కటినమైనదని కాలం గడుస్తూ బోధపడుతుంది.
అయినా, పురోగమించాలి. తప్పదు. అన్ని అడ్డంకుల్నీ అధిగమించి పోరాడాలి. ప్రేమను, జీవితాన్నీ పొంది నమ్మకాన్ని పెంచి పోషించుకునే ఆలోచనలతో అడుగు ముందుకు వెయ్యాలి.
కొందరు, క్రమశిక్షణ నిజం చెప్పగలిగిన సాహసం ధైర్యం సామర్ధ్యం త్యాగబుద్ది అందమైన ఆలోచనలు భావనలతో ..... అయితే హాస్యాస్పదం మాత్రం కొన్నిసార్లు ఆ కదలికల వల్లే వారికి హాని ఎదురుదెబ్బలు తరచు గాయాలు ప్రమాదాలెదురౌతూ చిత్రం కదూ!
ఆమె తనను తాను తిట్టుకుంది. అతను దూరమై మాయమయ్యాడని .... అందుకు కారణం తనే అని.
అమాయకత్వం, ఉత్సుకత లక్షణాలనే చూసి విసిగిపోతాడనుకోలేదు. ఆ రక్త నాళాల్లో తన రక్తమే ప్రవహిస్తుంది అని, అతని గుండెలో తనది స్థిర వాసం అని .... ఊహించుకుందే కాని. నిష్కల్మషమూ, పరిపూర్ణమూ అని ఊహించుకున్న తన ప్రేమ ఒక అపరిపక్వ అమాయకత్వ దిశారహిత లక్షణం అవుతుందనుకోలేదు.
ఆలశ్యంగా అవగతం అయ్యింది.
అతనికి ఇతరుల భావనలతో ఇతరుల జీవితాలతో ఆడుకోవడం ఇష్టం అని.
మార్చి మార్చి అవకాశమూ అదను కోసం వేచి చూస్తున్న సమయం లో తను ఎదురయ్యాను అని. కోరికలు తీర్చుకునేందుకే మాయమాటలు ఆ లౌక్యం ప్రయత్నాలు చేసాడు అని తెలిసి బాధపడింది. ఎంత దుర్మార్గుడు వస్తువును లా చూస్తున్నాడు అని.
అయినా ప్రేమించింది. నిజంగానూ, అమితంగానూ .... అతనే తను లా. తన అణువణువూ అతనే అన్నంత గాడంగా. అతనిలో ఎన్ని లోపాలున్నా, ఆ ఆలోచనలు అపరిపక్వమే అయినా .... సరే అనుకుంది.
అతను తనకు కావాలనుకుంది. అతనెప్పుడూ తన సరసనే ఉంటూ ఎంత పొందినా చాలదన్నంతగా అతన్ని తన ఇష్టాలకు అణుగుణంగా మార్చుకోవాలి అని. ఆశపడింది.
అతనో గాలి మనిషని. గాలిని కట్టెయ్యడం అసాద్యం అని తెలిసి కూడా
నిజానికి అతనెప్పుడూ తనను శాశ్వత జత అని అనుకోలేదు. అలా నడుచుకోనూలేదు.
అందుకే, ఎక్కడ ఉన్నాను అని తెలియని చోటుకు తీసుకువచ్చాడు. ఒంటరిగా వొదిలి వెళ్ళిపోయాడు అలాగైనా అర్ధం అవుతుందనుకున్నాడో ఏమో. అతనితో కలిసి నడిచిన ప్రతి ప్రదేశమూ, చూసిన ప్రతి దృశ్యమూ .... అందంగా, ఆహ్లాదంగా ఉండదని తెలపాలనుకున్నాడో ఏమో .
ప్రేమించి. కావాలనుకున్న తోడు, తోడుగా లేకపోతే ఏవీ అందంగా ఉండవు అని, తెలిసే.
మొదటిసారి అర్ధం అయ్యింది పూర్ణమ్మకు. తుఫానులు సునామీలకు మనుషుల పేర్లే ఎందుకు పెడతారో అని.
ఆమె ఆలోచనల్లో ఇప్పుడు .... అతను, అతనొక తుఫాను ఆమె జీవితం లో, రక్తనాళాల్లో, కణాల్లో, మది పొరల్లో, అంతరాంతరాల్లో లోలో ఎక్కడచూసినా శరీరాన్నే కాదు ఎదనూ ఆత్మనూ ఆవహించిన అపవిత్ర శాపం లా.