ఒంటరిని లా
నిన్నటివరకూ నీతోనే ....
నీడలా
నిన్ను ప్రేమిస్తున్నాను అని
చెప్పక,
ఆలశ్యం చేసాను.
ఒక ఆనందపు క్షణం
అనుభూతిని,
నిన్ను కోల్పోయి
నా మనోభావనల పదాలు
నిన్ను చేరక
నీ చిరునవ్వు
బహుమానం పొందక
ఇప్పుడు,
ఎప్పటికీ తెరుచుకోని
నీ కళ్ళనే చూడాల్సి
తప్పించుకోలేని నిశ్శబ్దంలో
No comments:
Post a Comment