Tuesday, November 18, 2014

సముద్రపు హోరు


నీతో కలిసి .... గమ్యం చేరే ప్రయత్నం లో
ఆ విశాల సాగర అనంతపయనం లో
సుదూరంగా కనిపించిన
విశాల శిఖరాన్ని చూస్తున్నప్పుడు .... చిత్రంగా,
అలల సవ్వడి చెవులను
నీటి తుంపరలు శరీరము ను తాకి
నీవూ, నేనూ మమైకమైన క్షణాల లో
నేను నిన్ను భద్రంగా పొదువుకునున్నప్పుడు
మన ప్రేమానుభూతుల జ్ఞాపకాల నెమరు,
ఆ సముద్రపు హోరులో కలిసి కరిగిపోయి



2 comments:

  1. మీరు ఏమీ అనుకోకుండా ఉండే పక్షంలో ఒక చిన్నసవరణ.
    సముద్రహోరు అనకూడదు.
    సముద్రం అన్నది సంస్కృతపదం. హోరు అన్నది తెలుగుపదం.
    సంస్క్ర్తపదం ప్రక్కన తెలుగుపదం ఉంచి సమాసం చేయరాదు.
    అందుచేత మొదట ఎడమవైపున ఉన్న సముద్రశబ్దాన్ని తెలుగులోకి సముద్రము అని తత్సమంగా తెద్దాము.
    ఇప్పుడు సముద్రము + హోరు -> సముద్రపుహోరు అని సమాసం అవుతుంది.
    సమాసం అంటే రెండు పదాలు కలిసి ఒకటే పదం అవటం అన్నమాట మీకు తెలుసు.
    ఒకటే పదం అయ్యాక హోరు అనే భాగంముందు స్పేస్ ఇవ్వకూడదు.
    సముద్రపుహోరు అన్నది ఒకటే వరుసక్రమంగా వ్రాయాలి.
    ఈ వ్యాకరణం గోల మీకు నచ్చకపోతే, వదిలెయ్యండి.
    భాష మనకి మాట నేర్పుతుందే కాని స్వయంగా మాట్లాడలేదుగా.
    ఇష్టం వచ్చినట్లు ఈ రోజుల్లో వాడుతూనే ఉన్నారు.
    మీ యిష్టం కూడా మీదే అన్నమాట.
    సెలవు.

    ReplyDelete
    Replies

    1. నా బ్లాగుకు హృదయపూర్వక స్వాగతం శ్యామలీయం గారు
      మీ స్పందనలో సూచన గమనించాను.
      ధన్యాభివాదాలు! శుభసాయంత్రం!!

      Delete