Friday, November 28, 2014

వెన్నెల కరిచిన రాత్తిరి


ఎంతో అందమైన రాత్తిరి
తియ్యని
వింత గగురుపాటు నరకపు చలి లో
విపత్తును మోసుకునొచ్చినట్లు
గాలి వాసన

చంద్రుడి ఆకర్షణా శక్తి కి
ముఖం పై
ముసుగు పొరలు
తొలగిపోయి

తప్పలేదు నాకు
పొద్దుతిరుగుడు పువ్వు నై
గాలి కి ఎదురు వెళ్ళక
ఎగరక ....
ఆ రాత్రి అందంలో ఈదులాడక

శూన్యమే ఆకాశమై
భూమికి ఆకాశానికీ మధ్య
ఇంత అందమైన వాతావరణం లో
కామదేనువు గర్భం లో లా
ఓ వింత అనుభూతి

దేవతావస్త్రాలేవో లా
నా ముఖం మీదనుంచి కదులుతూ
గాలి వింజామరులు .... చలి విపత్తు
అయినా
స్వాగతించాలనిపించే మార్పు సుమా!



2 comments:

  1. Replies
    1. వెరీ నైస్
      చాలా బాగుంది స్పందన

      హన్యవాదాలు ఎగిసే అలలు గారు!

      Delete