Friday, November 28, 2014

రావా పిల్లా! దరివై .... ఎదురు


నన్ను నేను కనుగొనేందుకు,
నా తొలి అడుగులు
తప్పులు దిద్దుకునేందుకు
అవగతం చేసుకుందుకు.
రావా పిల్లా! .... దరికి
తెలుసుకుందుకు
జన్మజన్మల అందమైన బాంధవ్యాన్ని 
నీవు నన్నెరుగుదువనే నిజాన్ని
కేవలం నీకు మాత్రమే తెలిసి
నీవే అని తెలియని గమ్యం వైపు
తడబాటు అడుగులు వేస్తున్నానని

మూసుకొనలేని కళ్ళను 
తెరుచుకునున్న హృదయ ద్వారాలను
భావుకుడ్నై ఉద్వేగం
ఉత్సుకత తపన చెందుతున్న క్షణాల్లో
అది నీ కోసమే అని తెలియక
నీ మార్గదర్శకత్వం కై మది ....
అలమటిస్తున్న క్షణాల్లో
రావా పిల్లా! దరికి ....
నన్ను కదిలించేందుకు
నీ నా నీడలను ఒకటి చేసేందుకు


ఆకర్షిత అయి నా ఎద నీ పట్ల ....
నీ దరి చేరాలని ఊగిసలాడే క్షణాల్లో....
తుళ్ళిపడకుండా ఉండేందుకు
పసి నడక నేర్చుకుంటూ
రాసుకుంటున్న సాహిత్యపు
ప్రేమ రాగం, జీవ మాధుర్యం భావం
నీవై నీ దరి చేరువవుతున్నట్లు
నేను కంటున్నది కల కాదని
నా జీవన గమ్యం .... కారణం
నీవని నమ్ముకుంటున్న క్షణాలలో
రావా పిల్లా!
భావుకత్వపరం గా నీవాడినే అని ....
నీవు లేని సంపూర్ణత లేదని .... నాకు

ఎదురుగా ఉంటే చాలు నీవు
ఆలోచనలే రావు
మనసే లేనట్లు
అంతా కలే అన్నట్లు
ఏదో వింత
అదో పిచ్చి .... అయినా
అదే అనుభూతి కావాలనిపిస్తూ,
నిన్ను మాత్రమే నేను .... ఎరిగున్నట్లు
కోరుకుంటున్నట్లు
ఆ కోరికే నా సంతృప్తి అన్నట్లు

రావా పిల్లా! దరికి ఇప్పటికైనా
చేతులు బార్లా చాచి
గుండెను తెరిచి ....
నన్ను కట్టిపడేసిన
ఏ తెలియని బంధం కోసమో ....
నా జీవసాగరం దరి నీవను బ్రమ లో
నీవైపుకే కదులుతూ
స్వేదానందం చెందుతూ 
నీవైపుకే చేరవస్తున్న నాకు ....
రావా పిల్లా .... దరివై .... ఎదురు

4 comments:

  1. ilaa piliste raakundaa unTundaa..

    ReplyDelete
    Replies
    1. ఇలా పిలిస్తే రాకుండా ఎలా ఉంటుంది?
      ప్రశ్న స్పందన
      కదా!?
      ధన్యవాదాలు ఎగిసే అలలు గారు! శుభోదయం!!

      Delete
  2. Replies
    1. మనోసాక్షి గారు నా బ్లాగు కు హృదయపూర్వక స్వాగతం
      నచ్చింది అని
      చక్కని ప్రోత్సాహక స్పందన అభినందన
      ధన్యాభివాదాలు మనోసాక్షి గారు!

      Delete