బూడిద కప్పిన నిప్పుముద్దలు
ఆసరా కోల్పోయిన
బొగ్గు పూలు
పూల రేకులు
బొంగురుపోయిన గొంతులు
అనంతమైన చీకటి సొరంగాల లో
పుణ్యక్షేత్రాల లో
నదీసంగమ స్థలాలలో
ఆఖరి కర్మలు
పోయిన అయిన పుణ్యాత్ముల
ఆత్మల శాంతి కోసం
అప్రయత్నంగా జారిన కన్నీరు
రాకాసిముల్లు అంచునుంచి జారిన
మంచుబిందువులు
ఏదో ఒత్తిడి
గుండె భారం
శ్వాస కష్టమై పెగలని గొంతుకలో
ముళ్ళకాయ
స్వార్ధం కమిలి
సిరలలోకి దారలా
ప్రవహిస్తూ
స్వచ్చమైన అవశేషాలు .... కొన్ని
అవశేషాలను ఇంత బాగా చెప్పడం మీకే చెల్లింది
ReplyDeleteఅవశేషాలను ఇంత బాగా చెప్పడం మీకే చెల్లింది
Deleteచక్కని ప్రోత్సాహక స్పందన .... ధన్యాభివాదాలు మంజు గారు! శుభోదయం!!
Nice..
ReplyDeleteనైస్
Deleteబాగుందని స్పందన
ధన్యవాదాలు ఎగిసే అలలు గారు! సుప్రభాతం!!
శ్వాస కష్టమై పెగలని గొంతుకలో
ReplyDeleteముళ్ళకాయ
స్వార్ధం కమిలి
సిరలలోకి దారలా..పదాలని చక్కగా పేర్చారు
చక్కని ప్రశంస, స్పందన
Deleteధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభసాయంత్రం!!