Wednesday, January 22, 2014

పదాలతో ....



 













కలిసిన అక్షరాలు పదాలు కొన్ని
అర్ధవంతమై, ప్రాణం కలిగుండి
శ్వాసిస్తాయి.
స్పర్శిస్తాయి.
విపరీత భావనల పదాలు కొన్ని
గాయపర్చి నొప్పిస్తాయి.
ఆశ్చర్యకరంగా ఔషదాలై
ఉపశమనం కలిగిస్తాయి.

పదాలు ఆత్మలు కొన్ని
అప్పుడప్పుడూ గుండెలపై భారమై
ఊపిరిసలపనీయవు,
అప్పుడప్పుడూ స్పూర్తిదాయకమూ ఔతాయి.
విజ్ఞతతో వ్యవహరిస్తే ....
పదాత్మలు అప్పుడప్పుడూ
మదిని, ఎదను సంతులనం చేసి
ఉల్లాసాన్నిచ్చే వరాలౌతాయి.

పలుకని చూపుల
పదాల భావనలు కొన్ని
రెండు హృదయాలను కలుపుతాయి.
పలుకరాని మాటలు కొన్ని .... రాలి
గుండెల్ని బ్రద్దలు చేస్తాయి.
శ్వాసించలేని స్థితిలోకి నెట్టేస్తాయి.
విరహ వేదన రాగా లై
మరణాహ్వానాలై పలుకరిస్తాయి.

అక్షరాలు పదాలు
ఉచ్చారణ పరంగా .... అప్పుడప్పుడూ
స్వర్గం ఇచ్చిన
పదామృతము, దివ్యప్రసాదం కావొచ్చు
అప్పుడప్పుడూ నరకం ఇచ్చిన
లేమి, దుర్భిక్షాలూ కావొచ్చు
ఆ పదాలలో .... ఏ పాళ్ళలో
అమాయకత్వం, విజ్ఞతలను కూర్చుకోవాలో
నిర్ణయించుకోవాల్సింది మాత్రం మనమే.

6 comments:

  1. నిజమే బాష కేవలం అక్షరాల కూర్పే... దానిలో భావం తెలుసుకోలి , కళ్ళతో చదివి మనస్సుతో తెలుసుకొని మస్తిష్కం తో ఆలోచించి అడుగువేయాలి, కొంత ఇంగితాన్నీ,కొంత వివేకాన్నీ రంగరించాలి.
    చక్కని కవిత.

    ReplyDelete
    Replies
    1. "నిజమే బాష కేవలం అక్షరాల కూర్పే .... దానిలో భావం తెలుసుకోవాలి , కళ్ళతో చదివి, ఎదతో అర్ధం చేసుకుని, మస్తిష్కం తో ఆలోచించి అడుగు ముందుకు వేయాలి, కొంత ఇంగితాన్నీ, కొంత వివేకాన్నీ రంగరించి మరీ.
      చక్కని కవిత."

      చక్కని కవిత అంటూ చిక్కని చక్కని కాంప్లిమెంట్ స్పందన
      ధన్యమనోభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!!

      Delete
  2. పదాల పసలూ, పదనిసలూ, పదనసలూ,
    పదాల పటుత్వపు కటువూ,
    పదాల ఉదార మ్రుదువూ,
    పదాలు పలికే పెదాల ఉజ్జాయింపు
    , పదాల ఆపదలు
    పదాలు చాలని,
    పదాల పరి పరి విధాల విరిని,
    విస్తారంగా వివరించారు చంద్ర గారు...

    ReplyDelete
    Replies
    1. పద పసలూ, పద నిసలూ, పద నసలూ,
      పదాల పటుత్వపు కటువూ, పదాల ఉదార మృదువూ, పద పెదాల ఉజ్జాయింపు,
      పదాల ఆపదలు .... పదాలు చాలని, పదాల పరి పరి విధాల విరిని, విస్తారంగా వివరించారు చంద్ర గారు.
      పదాలు అనే పద గారడీ చేసి మెస్మరైజ్ (సమ్మోహితుల్ని) చేస్తున్నట్లుంది స్పందన ఒక ప్రోత్సాహక స్నేహాభినందన
      ధన్యవాదాలు జానీ గారు! శుభసాయంత్రం!!

      Delete
  3. పదాలకు ప్రాణం ఉంటే ,మనం రాసిన పదాలే కదా అని వదిలేయకూడదు ,వాటి ఆత్మలు ఘోషిస్తాయి .పదాలను మనం మన పెద్దలను గౌరవించినట్లు గౌరవించి ,వాటిలోని మంచి విషయాలను గ్రహించి తదనుగుణంగా నడుచుకోవడమే మనం పదాలకు ఇచ్చిన గొప్ప గౌరవం .చంద్రగారు మీరు పద ప్రవేశం చేసి రాసినంత వాస్తవంగా పదాల భావన పలికించారు .

    ReplyDelete
    Replies
    1. పదాలకు ప్రాణం ఉంటే, మనం రాసిన పదాలే కదా అని వదిలేయకూడదు, వాటి ఆత్మలు ఘోషిస్తాయి. పదాలను మనం మన పెద్దలను గౌరవించినట్లు గౌరవించి, వాటిలోని మంచి విషయాలను గ్రహించి తదనుగుణంగా నడుచుకోవడమే మనం పదాలకు ఇవ్వగలిగిన గొప్ప గౌరవం .చంద్రగారు మీరు పద ప్రవేశం చేసి రాసినంత వాస్తవంగా పదాల భావన పలికించారు.
      చక్కని విశ్లేషణ స్నేహాభినందన స్పందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ!

      Delete