Wednesday, January 1, 2014

మాతృమూర్తి



 









నా ప్రతి సమశ్య నీదే అన్నట్లు
నీ గుండెల్లో భద్రంగా దాచుకుని,
నా కోసం .... తలపెట్టిన ప్రతి కార్యమూ,
ఎంతో ఇష్టం గా, నీ కోసం అన్నట్లు చేస్తుంటావు.

నాడు నీవు కావాలనుకునుంటే
నన్ను కనకుండా నీ సౌందర్యం
కాపాడుకునే అవకాశం ఉండీ
నన్ను కనేందుకే నీవు ఇష్టపడ్డావు.

ఆడపిల్ల ఇంటికి ఖర్చని, కనొద్దని
నీ తరుపు వారు, నాన్న తరుపు వారు
గర్భస్రావం చేసుకో అన్నప్పుడు
మన్నించండి! అని ధైర్యం గా నిలబడ్డావు.

అత్తారింట్లో సూటిపోటి మాటల్ని
స్థిర నిర్ణయం తో ఎదుర్కున్నావు.
అప్పుడెంతగా ఏడ్చుంటావో ఊహించగలను.
నీ కళ్ళు ఉబ్బి, కనుగుడ్లు ఎర్రగా మారుంటాయి.




 








జీవితం లో ప్రాముఖ్యతలను ఎన్నుకోవడం లో
నీకు నీవే సాటి అని ఋజువు చేసావు
ప్రాణ దాతా .... అమ్మా!
నా ప్రార్ధన లేకుండానే నాకు ప్రాణం పోసావు.

నిజం చెబుతున్నా! నేనెప్పుడూ ఆశ్చర్యపోలేదు.
ఆ కాలానికైనా
ఆ దైవానికైనా .... క్లిష్ట సమయాల్లో
నిన్నాదుకోక తప్పదని, అనుకునేదాన్ని అందుకే.

ఏ స్తోత్రము, ఏ శ్లోకం తోనూ నిన్ను కొనియాడలేను.
అమ్మా! నాకొక అస్తిత్వం కల్పించి ....
వ్యక్తిత్వాన్నిచ్చిన బలమైన నీ నిర్ణయము,
నీ మొక్కపోని పట్టుదలకు సాక్ష్యం గా నిలబడతాను.

మనిషిని, సమాజం నిర్ణయాన్ని .... ఎదిరించి ఓడించావు.
అందుకు సాక్ష్యం గా ఊపిరి పోసుకున్న నాకు
నీ మాతృహస్తం అందించి నా తొలి నేస్తానివయ్యావు.
నా హృదయం లో ఈ భువిలో నా ప్రధమ పూజ నీకే .... అమ్మా!

2 comments:

  1. అమ్మ అంటే అది .ఒక పరిపూర్ణ మాతృమూర్తిని చూపించారు చంద్రగారు .అమ్మ త్యాగాన్ని అభివర్ణించడానికి ఎన్ని వేల పదాలైనా చాలవేమో.చాలా బాగుంది చంద్రగారు ...అమ్మ....

    ReplyDelete
    Replies
    1. "అమ్మ అంటే ఆది. ఒక పరిపూర్ణ మాతృమూర్తిని చూపించారు చంద్రగారు. అమ్మ త్యాగాన్ని అభివర్ణించడానికి ఎన్ని వేల పదాలైనా చాలవేమో. "
      చాలా బాగుంది స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!

      Delete