Friday, January 24, 2014

అస్పష్టంగా



 














నాకు నీవు గుర్తొస్తుంటావు.
నన్ను నేను మరిచిపోయిన ప్రతిసారీ ....
జ్ఞాపకాల పుటలపై,
..........
నిశ్శబ్దంగా .... పేరుకుపోయిన దుమ్ములా
పేజీలను పుస్తకంగా కలిపి కుట్టిన దారం
బంధం లా .....
ప్రతి వాక్యం లోనూ, ప్రతి భావన లోనూ
ఎంతో తెలివిగా నైపుణ్యంగా దాక్కుని
ఆదమరచిన నిద్రలో నవ్వు అనుభూతి వి లా
.......
ఎప్పుడైనా జ్ఞాపకాలపై దుమ్ము దులిపి
పుస్తకం మధ్యలో ఏ పేజీలోకైనా తొంగి చూస్తే,
అక్కడ నా హృదయం నాకు కనిపిస్తుంది.
నీ భావనల అక్షరాల్లో కూరుకు పోయి
.......
చాలా కాలం అయ్యింది .... నీవు
నన్నూ ఈ లోకాన్నీ వొదిలి వెళ్ళిపోయి
ఓ ప్రియా!
కోపగించుకోకేం?
మత్తులో మరికాస్త మునగి,
నన్ను నేను మరిచి నీ జ్ఞాపకాలను పలుకరిస్తున్నానని.

4 comments:

  1. సర్, మందు మత్తు ప్రేమ కంటే నిషా అని నేననుకోను,
    ఎందుకంటే విషం తాగటానికి కూడా వెనుదీయదు ప్రేమ.
    మీ కవితల్లో ఇది చాలా నచ్చింది నాకు.

    ReplyDelete
    Replies
    1. "సర్, మందు మత్తు .... ప్రేమ కంటే నిషా అని నేననుకోను, ఎందుకంటే విషం తాగటానికి కూడా వెనుదీయదు ప్రేమ."
      మీ కవితల్లో ఇది చాలా నచ్చింది నాకు.

      చక్కని భావనతో బాగుంది స్పందన స్నేహాభినందన
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభసాయంత్రం!!

      Delete
  2. నన్ను నేను మరిచి నీ జ్ఞాపకాలను పలుకరిస్తున్నానని....... చాలా బాగుంది చంద్రగారు స్పష్టంగా .

    ReplyDelete
    Replies
    1. "నన్ను నేను మరిచి నీ జ్ఞాపకాలను పలుకరిస్తున్నానని....... చాలా బాగుంది చంద్రగారు స్పష్టంగా."

      అస్పష్టంగా లో స్పష్టత చాలా బాగుందని స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభసాయంత్రం!!

      Delete