Friday, January 17, 2014

జ్ఞాపకాల డైరీలో ....



 















ఒక మగువ మనసు తెలుసుకోవాలనే ఈ ఉబలాటం నా ఒక్కడికేనా ప్రతి పురుషుడిలోనూ ఉంటుందా! చిత్రం గా అనిపిస్తుంది ఆలోచిస్తుంటే .... ఒక చిన్న చిరునవ్వు లో ఒక చిరు పలుకరింపులో అంత ఆకర్షణ ఉంటుందా అని.

అప్పుడు నా వయస్సు ఇరవై నాలుగు.

ఆర్ టి సి బస్ స్టాండ్ లో పరిచయం అయ్యింది ఆమె. ఆమె ఎవరో ఎక్కడినుంచొస్తుందో ఎక్కడికి వెళుతుందో తెలియకుండానే మది ఆలోచనలు వాటంతట అవే ఆమె చుట్టూ అల్లుకుపోతున్నాయి. ఆమె కు ఇష్టం కలిగేలా నడుచుకోవాలని .... నాలో తహ తహ. ఆమె దృష్టిని ఆకర్షించాలని, ఆమెలో ఉత్సుకతను పెంచాలని,

ఆమె ఏమి చూడాలనుకుంటుందో అని ఊహించుకుంటూ తర్జనబర్జన అవుతూ .... మండుతున్న బంగారం లాంటి మనసును ఇష్టపడుతుందా లేక వెండిలా మెరిసే కండరాలను ఇష్టపడుతుందా అని ప్రశ్నలు?

ఒక వైపున ఆశ్చర్యం .... మరోవైపున పరిక్షగా చూడలేక పోయానే అని బాధ. చామంతి సొగసని .... ఎర్ర గులాబీలా ఉందని .... చామన చాయ సాధారణ సొగసని .... ఊహల అల్లికలు!?

ఔనూ వేసవి ఉదయపు వేళల్లో, చలికాలపు మధ్యాహ్నపు వెచ్చదనం వేళల్లో ఆమె శ్వాస వేగం సరళమా, భారమా అని? సరళమైన ఆమె మది మెలికలు తిరిగి నాకే ఎందుకు ఎదురుపడింది అని, అప్పటివరకూ ఆమె కూర్చున్న సీటులో ఆమె మరిచి పారేసుకున్న ఆ జ్ఞాపకం .... ఆ చేతి రుమాలు నాకే ఎందుకు దొరికిందీ అని .... ఆ యాదృశ్చికతల పరిణామాల పై అనుకూల ఊహలు?

బహుమర్మంగా పలుకరించినట్లే పలుకరించి అంతలోనే గుడ్ బై చెప్పి మాయమై, మదిని ఊహలు, విచారం తో నింపేసిన ఆమె .... మరోసారి డైరీలో అక్షరాల రూపం లో కళ్ళముందొక్కసారిగా తళుక్కున మెరిసి మాయమయ్యింది.

4 comments:

  1. కొన్ని జ్ఞాపకాలు మధురంగాను , కొన్నేళ్ళ తర్వాత తలచుకుంటే పిచ్చిగాను అనిపిస్తాయి . ఏది ఏమైనా ఆ వయసు ప్రభావం అంతేనేమో . అంతవరకూ ఉంటేనే అందం , శృతి మించితే అసహ్యం...చంద్రగారు అందరినీ మనసు డైరీల్లోకి తీసుకెళ్ళి పోయారు ఒక్కసారిగా ...కవిత చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. కొన్ని జ్ఞాపకాలు మధురంగాను, కొన్నేళ్ళ తర్వాత తలచుకుంటే పిచ్చిగానూ అనిపిస్తాయి. ఏది ఏమైనా ఆ వయసు ప్రభావం అంతేనేమో . అంతవరకూ ఉంటేనే అందం, శృతి మించితే అసహ్యం .... చంద్రగారు
      అందరినీ మనసు డైరీల్లోకి తీసుకెళ్ళి పోయారు ఒక్కసారిగా .... పోస్టింగ్ చాలా బాగుంది.
      ఒక చక్కని స్పందన స్నేహాభినందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ! శుభసాయంత్రం!!

      Delete
  2. స్వచ్చమైన ఓ పేజీ...మనస్సు పొరల్లో అలాగే ఉండాలి, కాగితం మీద పెడితే మాసిపోతుంది, మారిపోతుంది (అర్దం)
    మళ్ళీ,మళ్ళీ చదవాలి అనిపించేలా ఉంది.

    ReplyDelete
    Replies
    1. స్వచ్చమైన ఓ పేజీ .... మనస్సు పొరల్లో అలాగే ఉండాలి,
      కాగితం మీద పెడితే మాసిపోతుంది,
      మారిపోతుంది (అర్దం)
      మళ్ళీ,మళ్ళీ చదవాలి అనిపించేలా ఉంది పోస్టింగ్. ....

      ఒక చక్కని అర్ధవంతమైన స్పందన ఈ స్నేహాభినందన
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete