Friday, January 3, 2014

నేనింకా ఊహల్లోనే ....



 












ఎరుపు, నీలం రంగు
సీతాకోకచిలుకలు .... గాలిలో తేలుతూ
అల్లలల్లన సరాగాలు ఆడుతూ
నర్తిస్తూ,
పుష్ప సౌరబాల వేదికలపై
పాదముద్రల అద్దులు వేస్తూ,
ఎంతటి చక్కని వర్ణమో అది.

తామర పూలు,
బంతిపూలు
అన్ని వైపులా విస్తరించి
తెల్లగా, ఎర్రగా, పసుపు రంగులు
ముగ్గుల వాకిళ్ళలో
గొబ్బెమ్మలతో భూమాతను అలంకరించి
ఆ మహాలక్ష్మి ని స్వాగతిస్తూ 
ఎంత చిక్కని జానపద భావనలో అవి.

చిత్ర విచిత్ర దుస్తుల్లో బుడతలు
రంగులు రంగుల గాలిపటాల్ని
రకరకాల పరిమాణాల ఆశల్ని,
ఆకాశం లోకి ఎగరేసి .....
తెగి, గమ్యం చేరని, రాలిన
ఆశలకు న్యాయం కోసం పరుగులు తీస్తూ
ఎంతటి ఆహ్లాదకర జీవన యానమో అది.

అరమరికల్లేని పసితనపు ఆటలు
ఆ అరుపులు, ఆ పరిహాసాలు,
పేద, ధనికులమనే భావనలేని
ఆ నవ్వుల వాతావరణం లో
ఎవరి గెలుపునైనా అందరూ 
హర్షద్వానాలతో ఆహ్వానిస్తూ
ఎంత ఉల్లాసబరిత జీవనమో అది.

6 comments:

  1. అరమరికలు లేని పసితనం ...ఆనందాల నిలయం ....
    కొంత మంది ఎంత వయసు పెరిగినా పసిపిల్లలంత
    స్వచ్చమైన మనసు కలిగి ఉంటారు . అటువంటి
    వారి జీవితాంతం ఆనందాల నిలయమే .....
    పసితనమంత బాగుంది కవిత చంద్రగారు .

    ReplyDelete
    Replies
    1. "అరమరికలు లేని పసితనం .... ఆనందాల నిలయం ....
      కొంత మంది ఎంత వయసు పెరిగినా పసిపిల్లలంత స్వచ్చమైన మనసును కలిగి ఉంటారు . అటువంటి వారి జీవితం ఆనందాల నిలయమే .... పసితనమంత బాగుంది కవిత చంద్రగారు."
      ఎంతో చక్కని భావన స్పందనగా స్నేహాభినందన
      ధన్యవాదాలు శ్రీదేవి!

      Delete
  2. సంక్రాంతి సంబరం కనులకు కనబడకున్నా కలం లో కనబడి మురిపిస్తోంది చాలా బాగుందండి

    ReplyDelete
    Replies
    1. "సంక్రాంతి సంబరం కనులకు కనబడకున్నా కలం లో కనబడి మురిపిస్తోంది చాలా బాగుందండి"
      నా బ్లాగు కు స్వాగతం హరిత గారు! చాలా బాగుంది స్పందన అభినందన
      ధన్యాభివాదాలు హరిత గారు! శుభమధ్యాహ్నం!!

      Delete
  3. రంగురంగుల పువ్వుల చిత్రమేఅ కాదు పదాల్లోను కొత్త రంగులద్దారు...బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. "రంగురంగుల పువ్వుల చిత్రమేఅ కాదు పదాల్లోను కొత్త రంగులద్దారు"...బాగుందండి.
      బాగుంది స్పందన అభినందన
      హన్యవాదాలు పద్మార్పిత గారు!

      Delete