Friday, January 24, 2014

స్త్రీ హృదయం




ఈ వెదుకులాట ఎన్నాళ్ళుగానో అన్ని కోణాల్లోనూ
మది భూతద్దం తో .... చదవాలని చూస్తున్నాను.
ఒక స్త్రీ హృదయం అంతరంగాన్ని. ఆ అంతరంగం లో,
ప్రేమ ఖనిజాన్ని కనుగొని, పొందుదామని
ఆ స్త్రీ భావోద్వేగ ఆనందోల్లాసాల సంపదను
ఆకశ్మిక ప్రేమకు హక్కుదారుడ్ని అవుదామని

కానీ, ఎన్నో విధాలుగా పరిశ్రమించి శోధించాక
సమయమూ మూల్యమూ చెల్లించాక,
అందని ఆకాశం .... వైశాల్యం హృదయాన్ని
సముద్రమంత .... అనురాగం లోతుల్ని
పుట్ట తేనియను మించిన ఆ తియ్యదనాన్ని
అమ్మతనాన్ని చూసి ముగ్దుడ్ని భక్తుడ్నే అయ్యాను.

ఒక స్త్రీ హృదయం ఒక సరోవరం అయినట్లు
ఎక్కడో చిరు పాయలా, జల దారలా ఏ ఇంట్లోనో పుట్టి
ఇంకెక్కడో మెట్టినింట్లో నిశ్చల సరోవరం లా
ఆ ఇంటిచుట్టూ చెట్లూ పూల సొగసులు అద్ది,
బంధాలతో పెనవేసుకుపోయే నూతన లతా తత్వం ....
మమకారం, ఆత్మఆవిష్కరణ ను చూసాను.



 











స్త్రీ చూపుల్లో అద్భుత అయస్కాంతశక్తి ఉందని
పలుకులు హృదయాన్ని తడిమేంత మృదువుగా ఉంటాయని
నవ్వులు మెరుపుల వానై కురుస్తాయని తెలుసుకున్నా
లతలా కనిపించే ఆ బాహువుల్లో నిక్షిప్తమైన బలాన్ని
తూయలేని అమూల్యమైన ప్రేమను చూస్తూనే
ఒక అందమైన అనుభూతిని ఆ స్త్రీ సాన్నిధ్యం లో పొందాను.

ప్రతి స్త్రీ హృదయం లోనూ మండుతున్న ఆశల్ని
ఆశయాల అగ్నిగుండంలో దూకే సంసిద్దతను
ఆత్మసమర్పణ భావనను చూసాను.
స్వచ్చమైన స్నేహం కోసం
అచంచలమైన అనురాగం కోసం .... నిగ్రహాన్ని
ప్రాకృతికమైన జీవన సరళిని లక్ష్యంగా ....

4 comments:

  1. ఒక స్త్రీ హృదయాన్ని ఎంత అద్భుతంగా వివరించారు ,
    ఎంతైనా మీ అనుభవసారాలు అనిర్వచనీయం చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. ఒక స్త్రీ హృదయాన్ని ఎంత అద్భుతంగా వివరించారు ,
      ఎంతైనా మీ అనుభవసారాలు అనిర్వచనీయం చంద్ర గారు.
      బాగుంది స్పందన కవిత నచ్చిందనే ఏకీభావన స్నేహ అభినందన స్పందన
      నమస్సులు శ్రీదేవీ!

      Delete
  2. ఒక స్త్రీ హృదయం ఒక సరోవరం అయినట్లు
    ఎక్కడో చిరు పాయలా, జల దారలా ఏ ఇంట్లోనో పుట్టి
    ఇంకెక్కడో మెట్టినింట్లో నిశ్చల సరోవరం లా
    ఆ ఇంటిచుట్టూ చెట్లూ పూల సొగసులు అద్ది,
    బంధాలతో పెనవేసుకుపోయే నూతన లతా తత్వం....
    చక్కని పోలికతో మనసుని తాకిన పదాలతో కవిత బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. "ఒక స్త్రీ హృదయం ఒక సరోవరం అయినట్లు
      ఎక్కడో చిరు పాయలా, జల దారలా ఏ ఇంట్లోనో పుట్టి
      ఇంకెక్కడో మెట్టినింట్లో నిశ్చల సరోవరం లా
      ఆ ఇంటిచుట్టూ చెట్లూ పూల సొగసులు అద్ది,
      బంధాలతో పెనవేసుకుపోయే నూతన లతా తత్వం...."

      చక్కని పోలికతో మనసుని తాకిన పదాలతో కవిత బాగుందండి.

      చక్కని పదాలతో బాగుంది స్పందన మనోభినందన
      ధన్యమనోభివాదాలు పద్మార్పిత గారు!

      Delete