Monday, January 20, 2014

ఊహల నిర్జనారణ్యం లో ఆమె, అతను



 










మనుగడకోసం
మనిషి .... పోరాటాలు
సౌకర్యాలను కుదువబెట్టుకోవాలనే ఆరాటాల
ఆలోచనా సరళికి, దూరంగా
అందమైన అనుభూతిని కోరుకుంటూ
ఒక ఆమె, ఒక అతను.

ఎవరూ లేని, ఎవరూ చేరని
ఎటైనా పారిపోతే ఎంత బాగుంటుందో అని,
భూగోళం అంచు వరకూ విస్తరించి,
ఏ ఆకాశ హర్మ్యాలూ
ఏ అత్యున్నత శిఖరాలు అడ్డుతగలని,
విశాలమైన ఎడారుల్లో, పడీదుల్లో ....
ఈ భూమీ, ఆ ఆకాశం
ఒకదాన్నొకటి స్పర్శించుకుని
ముద్దాడుతున్న స్వర్గదామం లో
ఒక స్వేచ్చ పవనం అయి వీయాలని .... ఆమె, 



 










ఆ మబ్బు తెరలు వడబోసి పరుచుకునున్న
ఆ పలుచని వెలుతురులో
ఎడారుల్లో, పరుపుల్లాంటి ఆ పచ్చటి పడీదుల్లో
కలిసి పవ్వళించొచ్చేమో,
విశ్రమించొచ్చేమో అని .... అతను, 



 









అవును!
ఊహల ఉయ్యాల ఊగగలగడం
అందని ద్రాక్షలు అందుకుని ఆరగించగలగడం
చేరని గమ్యం చేరగలగడం
ఎంత అందమైన అవేశం, ఎంత అందమైన అనుభూతో కదా!

6 comments:

  1. ఊహలందం.
    అందాలకి ఊహలే అందం.
    ఊహలకందని అందం లేదు.
    అందలమైనా అరచేతికోస్తుంది.
    పరులకి మితమై,
    తమకే అపరిమితమై,
    పరిధులూ, అవధులూ దాటి
    ఆకాశపు టంచు ల్ని కొనగోటితో మీటుతూ, ఆనందపు పుటల్ని కనుసైగతో రాసినట్లుగా ఉంది. చంద్ర గారు.

    ReplyDelete
    Replies
    1. ఊహలందం. అందాలకి ఊహలే అందం.
      ఊహలకందని అందం లేదు. ఊహల్లో అందలమైనా అరచేతికోస్తుంది.
      పరులకి మితమై, తమకే అపరిమితమై, పరిధులూ, అవధులూ దాటి
      ఆకాశపు టంచుల్ని కొనగోటితో మీటుతూ, ఆనందపు పుటల్ని కనుసైగతో రాసినట్లుగా ఉంది. చంద్ర గారు.
      చక్కని విశ్లేషణాత్మక స్పందన స్నేహ ప్రొత్సాహకాభినందన
      ధన్యాభివాదాలు జానీ పాషా గారు! శుభసాయంత్రం!!

      Delete
  2. ఊహల పల్లకి లో విహరించే అమ్మాయికి, తన చర్యలనే ఊహలుగా మలచుకొనే అబ్బాయికీ...
    కేవలం ఊహలే కాదు ఆలోచనలలోనూ అంతర్యం ఉంది,( ఈ విషయం కవిగారికీ తెలుసూ, ప్రశంసించిన జానీ గారికీ తెలుసూ.)ఆశ వేరూ, ఊహ వేరూ... ఏమి చేద్ద్దాం పురుష ప్రపంచం :-))))

    ReplyDelete
    Replies
    1. ఊహల పల్లకి లో విహరించే అమ్మాయికి, తన చర్యలనే ఊహలుగా మలచుకొనే అబ్బాయికీ .... కేవలం ఊహలే కాదు ఆలోచనలలోనూ అంతర్యం ఉంది,
      ( ఈ విషయం కవిగారికీ తెలుసూ, ప్రశంసించిన జానీ గారికీ తెలుసూ.)
      ఆశ వేరు, ఊహ వేరు .... ఏమి చేద్దాం ఎంతైనా పురుష ప్రపంచం కదా:-))))

      కాసింత నిష్టూరం ప్రశంస కలిపి రంగరించిన స్పందన ప్రోత్సాహక అభినందన
      ధన్య అభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete
  3. ఊహ అన్నదే లేకపోతే మనిషి అసలు బ్రతకలేడేమో....కాదు,కాదు బ్రతకడు ఖచ్చితంగా ......ఊహ అందమైనది,అందనిది ,అందుకోలేనిది ...అయినా ఆనందానిచ్చేది .....అలా అని ఊహల్లోనే బ్రతుకును గడిపేయడం అవివేకమైనది .ఊహ మందు మాత్రమే అవ్వాలి,వ్యసనంలా మారకూడదు . చంద్రగారు మీ ఊహలు అద్భుతంగా ఉన్నాయని నిర్ధారించడమైనది .

    ReplyDelete
    Replies
    1. ఊహ అన్నదే లేకపోతే మనిషి అసలు బ్రతకలేడేమో .... కాదు, కాదు బ్రతకడు ఖచ్చితంగా .... ఊహ అందమైనది, అందనిది, అందుకోలేనిది .... అయినా ఆనందానిస్తుంది .... అలా అని ఊహల్లోనే బ్రతుకును గడిపేయడం అవివేకం. ఊహ మందు మాత్రమే అవ్వాలి, వ్యసనంలా మారకూడదు.
      చంద్రగారు మీ ఊహలు అద్భుతంగా ఉన్నాయని నిర్ధారించడమైనది.

      సూచనలతో కూడిన తీర్పు, ఊహ ఔషదం గా వాడొచ్చు కానీ వ్యసనం లా మారరాదని, స్నేహాభినందన స్పందన చాలా బాగుంది
      హన్యవాదాలు శ్రీదేవీ!

      Delete