Thursday, January 9, 2014

ఒక వింత భావన .... ప్రేమ




అది ఒక వింత అనుభవం
నేనూ నీవూ ఒక్కరిమవ్వడం
ఒక వరమని అనుకుంటా!
నువ్వనీ, నేననీ
నీతో నే నా జీవితం అని
ఇప్పటికీ నమ్మలేకపోతున్నా!
నిన్ను ఎదురుగా చూస్తూ ఉంటే,
స్వర్గం నన్ను చుస్తూ
చిరునవ్వులు చిందుస్తున్నట్లుంది.
అందుకే, ఈ రాత్తిరి
ఆ చందమామతో ....
నా ఆనందం పంచుకోవాలనుంది. 
మన ఇరు హృదయాల
రసాయనిక కలయికకు మునుపే
అడగని కోరికలు తీర్చే వరాన్నిచ్చిన 
దేవతను, నిన్ను పొదివి .... దగ్గరకు
నీ సమ్మతి తో .... తీసుకునే వేళ 
ఆ తారల రేడు కి
మది అభివాదాలు చెప్పాలనుంది.



 










చల్లని ఆ వెన్నెల కాంతి లో
నీ ముఖం ప్రకాశిస్తూ
వెన్నెల పరావర్తనం చెంది
ఉక్కిరిబిక్కిరయ్యే నేను
నీ కళ్ళలోకి చూస్తూ
నిన్ను ప్రాదేయపడే వేళ ....
నిజాన్ని దాయలేను.
నీ అంత చిక్కని, చక్కని
ముగ్ద, మనోజ్ఞ సౌందర్యం
వరించడమే అదృష్టం అని,
మనసును సమర్పించుకోగలను కాని
మాటల్లో వర్ణించి చెప్పలేను అని
నిజం!
నేను, నీవు కలవక మునుపే 
ఎవరో నిర్ణయించిన కలయిక మనది
అదృశ్య హస్తం ఏదో ఉందనేది నిజం.
అది ఆ వెన్నెలరేడు హస్తమే అని,

8 comments:

  1. సందేహం ఎందుకు ? ఖచ్చితంగా ఆ వెన్నెలరేడే........బాగుంది చంద్రగారు .

    ReplyDelete
    Replies
    1. సందేహం ఎందుకు ? ఖచ్చితంగా ఆ వెన్నెలరేడుదే ఆ అదృశ్య హస్తం ....
      బాగుంది చంద్రగారు.
      బాగుంది ఏకీభావన స్పందన ఒక స్నేహాభినందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ! శుభసాయంత్రం!!

      Delete
  2. చాలా కష్టమే ప్రేమించటమంటే...
    ఎన్ని భావాలను పలికించాలో అదీ చిన్ని గుండెలో నుండి.

    ReplyDelete
    Replies
    1. చాలా కష్టమే ప్రేమించటమంటే ....
      అన్నన్ని భావాలను పలికించడం .... అదీ గుప్పెడంత ఆ చిన్ని గుండెలో నుండి.
      సాధ్యమని తెలిసీ చక్కని సందేహం .... బాగుంది స్పందన ఒక స్నేహాభినందన
      ధన్యమనోభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభసాయంత్రం!!

      Delete
  3. నేను, నీవు కలవక మునుపే
    ఎవరో నిర్ణయించిన కలయిక మనది...

    మాటల్లో వర్ణించిన అమరిక...
    నిలువెల్లా పులకించేను మనసిక...

    its just amazing...
    more or less the same wavelength...
    may be or may not be...
    but, please view my post as well...
    http://nmraobandi.blogspot.in/2013/12/blog-post.html

    with regards...



    ReplyDelete
    Replies
    1. నేను, నీవు కలవక మునుపే
      ఎవరో నిర్ణయించిన కలయిక మనది...

      మాటల్లో వర్ణించిన అమరిక...
      నిలువెల్లా పులకించేను మనసిక...

      its just amazing...
      more or less the same wavelength...
      may be or may not be...
      but, please view my post as well....

      బాగుంది నచ్చింది నా భావనల్ని పోలినట్లే మీ భావనలూ ఉన్నాయి అని స్పందన స్నేహాభినందన
      ధన్యాభివాదాలు ఎన్ ఎం రావు బండి గారు! శుభోదయం!!

      Delete
  4. Chalaa chalaa baagundi, ee madhyalo nenu miss ayina mee kavitalanni chadivaa, chaalaa bagunnaayi:-):-)

    ReplyDelete
    Replies
    1. "చాలా చాలా బాగుంది,
      ఈ మధ్యలో నేను మిస్ అయిన మీ కవితలన్నీ చదివా, చాలా బాగున్నాయి:-):-)"

      నా బ్లాగు కు హృదయపూర్వక స్వాగతం! ఒక చక్కటి .... చిక్కటి ప్రోత్సాహక స్పందన మీ స్నేహాభినందన.
      ధన్యాభివాదాలు ఎగిసే అలలు గారు! శుభ సంక్రాతి!

      Delete