Saturday, September 7, 2013

కలలు


ప్రతి ఒక్కరి జీవితం లో
ప్రతిఒక్కరిలోనూ తీరని ఒక కోరిక
కలలా పరిణమించి ....
కలలు కనను అని చెప్పలేము.
జీవితం, మానుష ధర్మము కాదు నాది అని,

మనం మనలోకి చూసుకుని
అంతర్మదనం చేసుకుంటే,
ఎన్నో బలహీనతలు, ఎన్నో కోరికలు 
అవన్నీ మన కలలు
మనవద్ద లేనిది ఉండాలనే కోరికలు .... అవి.

ఒకవేళ 
కోరుకున్నఅన్ని అందుబాటులో ఉంటే
కనడానికి కలలు .... ఉండవు
ఉండవు .... జీవితాన్ని గురించిన ఆలోచనలు
ప్రేమ, అందమైన జీవన సరళిపై ఆకాంక్షలు.

అందరమూ
నీవూ, నేనూ కూడా కలలు కంటాము.
మనతో పాటే మన కలలు
మనము మాత్రమే మార్చగలిగిన
మన వాస్తవ జీవన లక్ష్యాలు.

2 comments:

  1. నిజమే,,, కలలు మన జీవన లక్ష్యాలే, చాలా బాగా రాశారు.

    ReplyDelete
  2. నిజమే! కలలు మన జీవన లక్ష్యాలే, చాలా బాగా రాశారు.
    _/\_లు మెరాజ్ గారు!

    ReplyDelete