Tuesday, September 17, 2013

పిచ్చి ప్రేమికుడు

అతని 
ప్రతి కవితలో వస్తువు, 
ప్రతి ఆలోచనలో సారమూ 
ఆమే!

ప్రతి కలలో 
కలగన్నది, 
కలలో ఎదురుచూసింది 
ఆమెనే!

అతనికి ఒక గీతం లేదు 
రాగం రాదు 
అతని ప్రపంచం కు .... 
కేంద్రబిందువు ఆమె.

అతనిలో 
సమర్పణాభావం 
అన్నీ త్యజించాలని 
ఆమె కోసం!

ఇచ్చాడు. ఇస్తున్నాడు. 
ఇస్తూనే ఉన్నాడు. 
ఆమె తీసుకుంది. 
కావాలనుకున్నదీ కోరుకున్నదీ అయితే. 

ఆ బంధం అంతటితో ముగిసింది. 
ఇప్పుడతను విరహం లో కొట్టుకుంటున్నాడు. 
అది ఒకవైపు ప్రేమ అందామా .... 
అతనిది పిచ్చి ప్రేమ అందామా!

2 comments:

  1. Replies
    1. నైస్ .... స్పందన అభినందన
      ధన్యవాదాలు వాసుదేవ రెడ్డి గారు

      Delete