Saturday, September 7, 2013

నేనూ నా నిశ్శబ్దం నీడలు


ఔనూ ఎవరన్నారు? 
చలికాలం లో నది నిచ్చలనమని, 
తుఫాను వేళల్లో మబ్బులు కదలవని, 
ఎవరన్నారు? మొరటోడికి ఏడుపు రాదని. 
ఒంటరికి ఒంటరితనం తోడుండదని, 

ఎవరూ అన్నట్లు వినలేదు నేను! 
మనిషికి విసుగే ఉండదని, 
ఒక్కసారి నా గుండెలోకి తొంగి చూడు. 
అక్కడ .... అంతా శూన్యమే,
మనసులో అక్కడ .... అంతా అయోమయమే, 

నేనన్నది నిజమే! 
నేను దూరంగా ఒంటరిగానే కూర్చునుంటానని,
నా మాటల్ని విపరీత అర్ధాలతో చూడకు 
దూరంగా వెళుతుంది .... నేను కాదు 
నా మనసు మాత్రమే 
కాసింత ఒంటరిసమయం కోసం

అన్ని విషయాల్ని ఒకే చోటుకు చేర్చుకుని, 
ఒక పద్దతిగా సర్దుకుని, 
నా ఒంటరి తనం లోకంలోకి అలా ....
నేను దూరంగా పోవడం ఎంతో అవసరం. 
నీకు నేనెందుకు భయపడుతున్నానో తెలిస్తే తట్టుకోలేవు. 
నేను పడుతున్న పీడ బాధ అవగాహన ఎవరికీ అర్ధం కావు.

దూరంగా కూర్చున్నాను. వెళ్ళిపోతున్నాను. 
దూరంగానే ఉంటాను. కూర్చుంటాను. కుదేలుపడతాను. 
నాకే ఎందుకు ఈ బౌతిక మానసిక భారం 
నేనెవ్వరి ప్రేమకూ అర్హుడ్ని కానట్లు, 
అందుకే వెళుతున్నాను దూరంగా 
నా భావనలతో నేను, ఒంటరిగా .... నిశ్శబ్దంలోకి,

2 comments:

  1. అందమైన ఊహా లోకం మీకుంది అందులో మీ మనసుకు నచ్హినట్లు ఉండొచ్హు. కానీ నిరాశాఅ వాఅదన మంచిది కాదు. మంచి కవిత గొప్ప భావుకత ఉంది.

    ReplyDelete
    Replies
    1. ఒక మంచి మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటుంది
      సున్నిత హృదయం సాటి మనిషి బాధను తనూ కొంత పంచుకోవాలనుకుంటుంది.
      ఎంత చిత్రమో .... జీవితం! అందమైన ఊహాలోకాన్ని చూడమంటున్న మంచి మనసుకు మనో_/\_లు మెరాజ్ ఫాతిమా జీ!

      Delete