ఉండే ఉంటాడు ఎక్కడో
ఏ సుదూర తీరాలకో తీసుకుపోయేందుకు
నిన్ను
ఎవరి కలలు, ఊహలు కనుగొనని చోటుకు
నీకైనా తెలుసా
ఎవ్వరికీ తెలియదనుకుంటున్నాను
నీ స్వచ్చ నిర్మల ప్రేమకు
పాతృడు ఎవరో
నిన్ను పొందే ఆ అదృష్టవంతుడు ఎవరో
దాయలేని విశాల చక్షువులు
నీ కళ్ళలో చూడగలుగుతున్నాను.
వింత భావాన్ని
అందమైన నమ్మకాన్ని
ఆ ఎవ్వరో నేనే కావచ్చని
ఎవరు అందుకుంటారో
నీ సున్నిత సుకుమార హస్తాన్ని
అంచలాగ్రాన్ని
ఆ అమూల్యమైన బహుమానాన్ని
నీ హృదయాన్ని
ఎవరు చెప్పగలరు
రేపు ఏమి జరుగుతుందో
ఎక్కడ నీవు స్థిరపడతావో
ఏ దూరతీరాల్లో ఉన్న
ఏ అపరిచితుని సహచరివౌతావో
ఎవరికీ తెలియదు
ఏ మలుపు తిరుగుతుందో నీ జీవితం
నేను మాత్రం చూస్తున్నాను .... ఆశగా
నీ కళ్ళలో .... నా పట్ల పెరిగిన
ఆ స్వచ్చ నిర్మల ప్రేమ భావనలనే
అగ్గిపెట్టె గిగ్గిపెట్టె అని చిన్నప్పుడు ఆడుకొనే వాళ్ళము. అలావుంది.
ReplyDeleteఎందుకీ బూచి తవికెలు ?