అందరిలా నేనూ ....
జారవిడుచుకున్న కాలాన్నీ కలల్నీ
ఆశ్చర్యం తో పాటు ఆనందం గా ఉంటుంది
నా అదృష్టాన్ని తలచి చూసుకుని
నీవు భాగస్వామివయ్యుండటం
నేను వెనుదిరిగిన ప్రతిసారీ
ఒక వింత భరోసానిస్తూ
ఎదురుగా నవ్వుతూ .... నీ మోము
నా కోసమే అన్నట్లు ఉండటం
నా కలల్లో నీ రూపమే ఎప్పుడూ
ఎంతో ప్రకాశవంతంగా,
తీక్షణంగా, ఆకాశం రాణిలా
నా హృదయాకాశం లో నీ రూపం
ఎన్నో జీవితాల కాలాలపాటు లా
నీకోసమే అలంకరించిన ప్రదేశం లో
దేవతా స్థానం లో
నా ప్రతి ప్రశ్నకూ అర్ధం, సమాధానం లా
నేనెక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా
నీ దృష్టి కోణమే నా చూపులా
మమైకం భావన, ఎలా ఉంటుందో ....
ఆకాశాన్ని చుంబించడం,
ఆకాశం నా చేరువలో ఉండటం
ఎలా మరిచిపోగలను .... ఆ భావనను
అందువల్ల కలిగిన సంకల్ప బలాన్ని
అంతా నీ ప్రేమవల్లే సాధ్యం అయ్యింది.
జీవితం ఇంత సులభం అయ్యింది
అను క్షణమూ నా మదిలో
నా చేరువలో నా బలానివై ఉన్నందుకు నీవు
నీకు నేను ఋణపడి ఉన్నాను
నీకు తెలుసా?
నేనూ ఎప్పుడూ నీలోనే చూసానని
నా ప్రకాశాన్ని,
నా సామర్ధ్యాన్ని
నా జీవన సరళిలో
నీ ప్రభావానికి నేను
ఎన్ని విధాలుగా .... లోనయ్యానో అని,
అందుకే నీకు ధన్యవాదాలు చెప్పాలనుంది.
నా కోసమే దివి నుంచి
భువికి దిగివచ్చిన వరానివని
నా జీవన మార్గదర్శనానివీ అని
No comments:
Post a Comment