Sunday, July 26, 2015

నిరర్ధక రహదారుల్లో .... నేను



నేను నడుస్తాను.
ఒక ఖాళీ విగ్రహం లా
నాకు తెలుసు .... స్వేధానికి బదులు
నా అడుగు అడుగు లోనూ
రక్తం చిందిన గుర్తులే 
వదులుతానని

నేను మాట్లాడుతాను.
ఒక నిశ్శబ్ద పదార్ధం లా
నాకు తెలుసు .... ఉద్యమ భావాల బదులు
నిడివైన పోగొట్టుకున్న
నీతిమాలి జారిపోయిన
ఆలోచనలనేనని 


నేను పదాలు అల్లుతాను.
అతి చిన్న జ్ఞాపకాల అనుస్మరణలని
నాకు తెలుసు ..... సంఘటితత్వ పోరాటం బదులు
నిరర్థకము, మూర్ఖపు తలవాకిళ్ళవని
చదవడం అర్ధం చేసుకోవడం
ఎంతో క్లిష్టమని

No comments:

Post a Comment