Sunday, June 29, 2014

ఎంత ఓపికో ....





వారసుడిని చేరాలని
రెప్పలు ఉబ్బి, కళ్ళు కాయలు కాసి
వేచి, చూసి చూసి .... భూగర్భం లో
దాగి వొదిగి .... అమూల్యమైన సంపద,
దుమ్ము కొట్టుకుని ....
ఆ పాత చెక్క పెట్టె లోపల,

2 comments:

  1. వారసుడిని చేరాలని
    రెప్పలు ఉబ్బి, కళ్ళు కాయలు కాసి
    వేచి, చూసి చూసి .... భూగర్భం లో
    దాగి వొదిగి ....

    ఈ స్థితి తన కన్నపిల్లలు తప్పిపోయినప్పుడు మానవులు ఎదుర్కొన్న స్థితి ఆ ధనం కూడా ఎదుర్కొంటున్నది కొన్ని కొన్ని సందర్భాలలో . ఎందుకంటే ఈ ధనం మానవుని చేత సృష్టించబడటం వలన దానికీ మానవుని దుస్థితి తప్ప(టం)లేదు .

    దుమ్ము కొట్టుకుని ....
    ఆ పాత చెక్క పెట్టె లోపల,

    ఈ స్థితి " తను ధరించవలసిన దుస్తులు వెరొకరు ధరించిన పరిస్థితులలో , ఏదో ఒక దుస్తులు ధరించటం ముఖ్యమనుకున్నట్లు , ఆ సంపద తనను చక్కటి అందమైన భాండారంలో ఉంచలేకపోయినందుకు బాధపడ్తున్నా , ఈ పాత చెఖ్ఖపెట్టె లోపల ఉంచినందులకు లోలోపల సంతసిస్తూ అంతకంటే ఉన్నత స్థానాన్ని అందించేవారి కొఱకు ఎదురుతెన్నులు కాయటనికి ఎంత ఓపికో కావాలి కదండి .

    ఎంతమంది కడుపులు కొట్టినదో ,
    ఎన్నాళ్ళు కడుపు ఎండబెట్టుకొన్నదో,
    పలు తెఱగులా కూడబెట్టినదో ,
    ఎంతమంది అక్కసుల ఆక్రందనో అది ,
    కొంతమంది రక్కసుల బారినైనా పడకుండా ,
    భూగర్భంలో దాచబడ్డది ,
    అహహ ఉంచబడ్డదై ,
    కాలగర్భంలో కలిసిపోయి ,
    కనుమరుగై ,కనుపించక ,
    తనను కనిపెంచినవారినీ చేరుకో(లే)క ,
    ఏ నాటికో , ఎవ్వరికో ,
    వశమై , పరవశాన్నందించి ,
    అనేక వందనాలందుకుంటుంది ,
    సంపాదించినవాడు తనకీయవలసిన ,
    విలువీయకుండా ,మట్టిలో కలిపిన క్షణం .

    ఎంత ఓపికో ఆ వారసుడిని చేరుకోవటానికి ,
    చూపించక తప్పదు కదా మఱి .


    ReplyDelete
    Replies
    1. నేను రాసిన ఈ చిన్న కవితను మీరు అన్ని కొణాల్లోంచి పరిశీలించి విశ్లేషించిన విధానం చూసాక మీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని గ్రహించాను. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తాను.
      ధన్యమనోభివాదాలు శర్మ గారు!

      Delete