Wednesday, June 4, 2014

ఇష్టం, తోడయ్యేందుకు ఎదురొస్తే .... ఎంత బాగుణ్ణు!




జీవన భాగస్వామిని గా ఎవరినైనా
కోరుకుంటేనే అర్ధం అవుతుంది .... ఎవరికైనా
జీవించినంత వరకే ఏ ఇష్టాయిష్టాలైనా .... ఎప్పుడైనా
ఒక్కోసారి, ఒంటరితనమే ఇష్టం అని
ఎవరి ప్రేమలోనూ పడరాదనుకుంటాము. కానీ,
అంతరాత్మకు తెలుసు, అది నిజం కాదని
ఆ పలుకులు అబద్దం అని
కోరుకున్న లక్షణాల తోడు దొరకకే, ఆ ఆలశ్యం అని

నిజం! ఎవరి ప్రేమలోనైనా పడి
ఆ ప్రియురాలి తోడును కోరుకుని
తన ప్రపంచం ఆ ప్రియురాలి కళ్ళలో చూడగలిగితే
ఎంత మనోహరమో కదా!
అన్ని అవస్థలలోనూ పక్కన ఉండి, తనలో భాగం లా
ఒక అనంత ఆనందం ప్రవాహం లా .... అనిపిస్తూ
పక్కన పరిభ్రమించే ఒక బాధ్యత లా
బంగారమై అంటిపెట్టుకుని ఉన్నట్లు
బంగారం పూసిన దాంపత్యమై తోడులా మెరిస్తే,

కలలు కోరికలు ఆశయాలన్నీ పోగు పోసి
ఏ మనిషైనా తన ఇష్టానికి ఒక రూపాన్నిచ్చి
ఆ రూపాన్ని ఎవరిలోనైనా చూసి
ఆమె ప్రేమను ఆశించడం
ఆ తోడును కోరుకోవడం
చాలా కష్టం అనిపించి, సాధ్యం కాదనిపిస్తే
తెలియని ఆ అంతర్యామిని కోరుకుంటాడు.
ప్రకృతి లాంటి ఆ పరిపూర్ణ స్త్రీ తన కోసం
తనకు తోడుగా మిగిలుండేలా చూడమని




జీవితం ఎంత భారమైనా ఒక అద్భుత భావన చాలు ....
మనసు పరవశించడానికి
కలల వినీలాకాశం లో కలిసి విహరించడానికి
ఆనంద బాష్పాలతో బుగ్గలు చెమరడానికి
ఒక ఇష్టమైన తోడు తన వైపు నడిచి వస్తూ
తోడుంటానని మాటిస్తే
ప్రేయసి కళ్ళలో తన కలల ప్రపంచం పునర్నిర్మాణం
సాధ్యం అయితే, కాదా? జీవనం స్వర్గతుల్యం.


No comments:

Post a Comment