Sunday, June 22, 2014

ఆమె నాకు ఎదురొస్తే .... బావుణ్ణు!?




నాకు చాలా ఇష్టం నా దారికి తను ఎదురొచ్చి
తన ఇష్టాన్ని నా అబిమతంగా ఔననిపించుకునేటప్పుడు
తను నన్ను పిలిచే పలుకులలోని మార్దవం 
ఎంత తీపి రుచో ....
ఆ పెదవులపై కదిలుతూ నా పేరు
ఆ కళ్ళతో తను నన్ను కదలనీయకుండా
బలంగా బంధించెయ్యడం ఎంత మనోహరమో
అందుకే అనిపిస్తూ ఉంటుంది
నాకు తెలిసిన ఒకే నిజం నా చెలి, తానే అని
నాతో అలాగే ప్రవర్తిస్తుందని ఎన్ని జన్మలుగానో నాకు తెలుసని  




అది, కలో మాయో నిజమో .... కానీ
నాకు తెలిసింది మాత్రం ఒక్కటే
తను సమీపం లో ఉంటే సేదదీరుతున్నట్లుంటుంది
విశ్రమించుతూ ఉండిపోవాలని ఉంటుంది ....
అది మరణమే అయినా సరే లా
ఆమె బాలుడ్ని లా నన్ను బుజ్జగిస్తున్నట్లు
ఆకాశమే వంగి నాకు మనస్కరించుతున్నట్లు 
నిజం గా .... తను నా పక్కన ఉన్నప్పుడు
ఎంత ఆనందం ఉల్లాసం ఆహ్లాదమో .... జీవితం

ఆమె స్పర్శ లోని మృధుత్వం
నా శరీరాన్ని తాకుతున్నప్పుడు
రెక్కలు అమర్చిన సీతాకోకచిలుకను లా అనిపిస్తూ
సహజంగా బిడియస్తుడ్ని, భయస్తుడ్ని
ఎవరినీ అంత సమీపం లో ఉండాలనుకోని నేను
ఎందుకిలా .... ఆకాశం, భూమి మధ్య త్రిశంకు స్వర్గంలో
తనూ నేనూ మాత్రమే ఉండాలనుకుంటున్నానో
భద్రం సురక్షితం అనుకున్న అన్ని అనుభూతుల్ని దాటి
తను నా సమీపానికొచ్చిందనో ఏమో




నాలోని ప్రతి అణువు ఇప్పుడు
ఆమె సాన్నిహిత్యాన్నే కోరుకుంటుంది
ఆనందం, ఆహ్లాదం, ఉల్లాసం అనుభూతి కోసమో ఏమో
అది మరణమే కావొచ్చనిపించినా 
తను నన్ను ఒక పసిబాలుడ్నిలా చేసి చూస్తుందనిపించినా
మళ్ళీ మళ్ళీ తన సాంగత్యమే కావాలనిపిస్తూ
నా మార్గానికి ఎప్పుడూ తనే ఎదురు రావాలనిపిస్తూ
తను నన్ను పోట్లాడాలనిపిస్తూ
ఆ గోరువెచ్చని స్పర్శతో ఊహలకు రెక్కలొచ్చి
ఎగిరిపోవాలనిపిస్తూ ..... ఏమైపోతుందో ఏమో నాకు

2 comments:

  1. నమస్కారం సర్ నా వయసుకి ఇవి అవసరమా అనిపిస్తుది కాని మీ పదాల అల్లిక నాకు ఎతో మనిస్క అనదం బలే పదములు వెంగ్యము లేని పద ములును ఉపయోగిస్తున్నారు చాల సంతోషం

    ReplyDelete
    Replies
    1. నమస్కారం సర్ నా వయసుకి ప్రేమ ప్రణయం బంధం సాహచర్యం అవసరమా అనిపిస్తుంది
      ఏ వయసుకైనా ఇవి నిషిద్ధాలు కావు నేస్తం
      కాని
      మీ పదాల అల్లిక నా .... మనసుకు ఆనందాన్నిస్తుంది, భలే పదములు .... వెంగ్యము లేని .... విధంగా
      చాల సంతోషం
      చాలా సంతోషం బలాన్నిచ్చే గొప్ప ప్రోత్సాహక వ్యాఖ్య మీ స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు కలిగొట్ల వెంకట రత్న శర్మ గారు! శుభోదయం!!

      Delete